గత కొన్ని రోజులుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్ లపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గత ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియా ఆనందం ఏందో మరి అర్థం కావడం లేదు.. ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యనించారు. రాహుల్ గాంధీ పాద యాత్రకు వస్తే.. ఎంతో కష్టపడి పని చేశా.. కులాల వారీగా సమస్యలపై రాహుల్ గాంధీ కనెక్ట్ అయ్యారు అని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ పాదయాత్రతోనే నా పేరు కూడా నోటెడ్ అయిందని అన్నారు.
సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేయడంతో నాకు చాలా బాధ అనిపిస్తుందని జగ్గారెడ్డి అన్నారు. ఎన్నో కష్టాలు పడి లీడర్ అయ్యా.. అనేక ఒడి దుడుకులు పడి వచ్చా.. ప్రజల మధ్య గడుపుతున్నాం.. ఫీల్డ్ లీడర్స్ మేము.. నన్ను బీఆర్ఎస్ లోకి రావద్దని హరీష్ రావు దగ్గర చెప్పిన వాళ్లంతా నా దగ్గర పెరిగిన వాళ్లే అని ఆయన అన్నారు. నాది జాలి గుండె బతుకుతా అంటే.. పో అని చెప్పినా.. ఇది ఫైనల్.. మళ్ళీ మళ్ళీ నాకు రాజకీయ శిల పరీక్ష పెట్టొద్దు అని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. నా రాజకీయ ప్రయాణం.. రాహుల్ గాంధీ తోటేనని తెలిపాడు.
ఏడాదిన్నర నుంచి ఇద్దరు ముగ్గురుని ట్రోల్ చేసి బతుకుతున్నారో బతకండి అంటూ జగ్గారెడ్డి అన్నారు. మా బతుకులతో అడకండి.. సోషల్ మీడియాలో ఎక్స్పెర్ట్ ఎవరు.. ఈ కల్చర్ తెచ్చింది టీడీపీ నుంచి వచ్చిందే.. ఎవరనేది మీరే ఆలోచన చేసుకోండి.. ఏ పార్టీ నుంచి మా పార్టీకి వచ్చినా వాళ్ళు మా పార్టీ వాళ్లే అని ఆయన పేర్కొన్నాడు. పార్టీ మారుతున్నారనే ప్రచారాం అబద్ధం.. కాంగ్రెస్ మీటింగ్ ఏం జరిగినా నాకు సమాచారం వస్తుంది.. దుష్ట శక్తులు.. దుర్మార్గపు మనుషులకు ఒకటే చెప్తున్న.. మా క్యారెక్టర్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ముర్కులకు.. అన్నీ బంద్ చేస్తున్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
ఒకడు స్క్రీన్ పెట్టి.. ఒకడు 19.. అంటాడు.. ఇంకొడు ఇంకో డేట్ అంటాడు.. నేను కన్నెర్ర చేస్తే.. మీరు ఉంటారా అని జగ్గారెడ్డి హెచ్చరించాడు. రోడ్ల మీద తిరుగుతారా.. మీకేమైనా ప్యాకేజ్ ఇస్తున్నారా.. ఎవడు ఇస్తున్నాడు మీకు.. కొంత మంది నా రాజకీయ జీవితంతో ఆదుకోవాలని అనుకుంటున్నారని ఆయన తెలిపాడు. నేను గేమ్ స్టార్ట్ చేస్తే.. మీరు తిరగలేరు.. ఈ సారి ఎవడైనా మాట్లాడితే.. నడిరోడ్డు మీద బట్టలు విప్పుతాను అని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఖమ్మంలో భట్టి విక్రమార్క అభ్యర్థిని పెట్టారు.. మెదక్ లో నేను అదనంగా కాంగ్రెస్ కి ఉన్న ఓట్ల కంటే 9 ఓట్లు ఎక్కువ తెచ్చిన.. ఎన్నికలు కాగానే మళ్ళీ పోతున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే.. కౌంటర్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు.. మెంటల్ ఎక్కిందా.. ఈ కొడుకులకు.. పద్ధతే లేదా.. రెండు నెలల నుంచి మళ్ళీ అదే కథ.. ఇంతకీ.. కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఉండొదా అని ఆయన ప్రశ్నించారు. దీని వెనకాల ఎవడు ఉన్నాడు.. ఏడాదిన్నర నుంచి ఇలాంటిది చూస్తున్నా.. చెత్తనా కొడుకులు.. ఏం అనుకుంటున్నారు అంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.