రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశామన్నారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన జగన్ మరడాం లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. అలాగే గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాఏర్పాటు చేశామన్నారు.. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాని జగన్ తెలిపారు. ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు.
నాలుగేళ్ల పాలనలో మీ బిద్ద విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమాలు తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయింజర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతిదీవెనను తీసుకువచ్చాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ రాబోతోంది. పాడేరులో మెడికల్ కాలేజీ రాబోతోంది. బోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతోంది. సాలూరులో గిరిజన వర్సిటీ వచ్చేస్తోంది. గిరిజన విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం.