ప్రజల వినతులను పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ విజయవంతంగా నేటితో ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సజ్జల ప్రవేశ పెట్టనున్నారు. . ఏపీ సీఎం వైఎస్ జగన్ జూన్ 23న ‘ జగనన్న సురక్ష ‘ అనే నెలరోజుల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గృహాలకు చేరువలో ఉన్న వారి సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపుల నిర్వహించారు. అలాగే‘1902’తో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపనతో ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్ష ప్రారంభించారు. అలాగే ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు డివిజన్, హౌస్ హోల్డ్ డివిజన్, ఆదాయం) మొదలైన 11 రకాల ధ్రువీకరణపత్రాలు సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందించనున్నారు. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు. ఈ దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేసారు.