ఏపీ ముఖ్యమంత్రి(AP CM) జగన్(JAGAN) విదేశాల్లో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)కి చెందిన నాయకులు మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జగన్ తిరిగి రాగానే ఏదో భారీ మార్పు ఉంటుందనే ప్రచారం పార్టీలో జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన ఈ నెల 10 లేదా 11వ తేదీన తిరిగి విజయవాడ(VIJYAWADA)కు వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 9వ తేదీనే ఆయన తిరిగి రావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వలన పర్యటన షెడ్యూల్(TOUR SCHEDULE) రెండు రోజుల పాటు పొడిగించారని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఉత్కంఠంగా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ విదేశాల నుండి వచ్చిన తరువాత కూడాా ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని కూడాా పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఇదే సమయంలో ఎన్నికలకు సంబందించిన ప్రణాళికలు కూడాా రెడీ అవుతున్నాయని చెబుతున్నారు. జగన్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత ఆయన దృష్టి అంతా ఎన్నికల(ELECTIONS) పైనే ఉంటుందని అంటున్నారు.
రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలపై కూడా ఇప్పడు పెద్ద చర్చే జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన వ్యవహరంలో కేంద్రం తీసుకునే నిర్ణయానికి వైఎస్ఆర్ సీపీ కూడా కట్టుబడి ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే జమిలి ఎన్నికలు జగన్ సై అంటారని, విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం జరుగుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడు నెలలు సమయం ఉంది. అయినప్పటికి ఎడాది ముందు నుంచే ఎన్నికలకు సంబందించిన ఫీవర్ రాష్ట్రంలో పెరిగిపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో పాటుగా, దాడులు, ప్రతి దాడులు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అవసరం అయితే ముందుగానే ఎన్నికలకు వెళ్లేందుకు కూడా అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా పార్టీ లో జరుగుతుంది.