కరోనా తర్వాత చాలా రోజులకు థియేటర్‌లు కిక్కిరిసిపోతున్నాయి. వందేళ్ల సినీ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి జోరు చూడలేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్‌లే తీర్మానించేస్తున్నాయి. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల్లోనే దాదాపు రెండు కోట్లకు పైగా టిక్కెట్‌లు తెగాయంటే ఆశా మాశీ కాదు. ఇలాంటి అద్భుతం జరిగి ఇప్పటికి పదేళ్లయిందని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనాలు థియేటర్‌లకు ఎగబడుతున్నారట. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ సినిమా హిస్టరీలో మంగళవారం సరికొత్త రికార్డు క్రియేట్ అయింది.
మంగళవారం ఒక్కరోజే ప్రేక్షకులు సినిమాలు చూడాడానికి రూ.140 కోట్లు ఖర్చు చేశారట. అన్నికంటే ఎక్కువగా సన్ని డియోల్ నటించిన గదర్-2 కలెక్షన్‌లు కొల్లగొట్టింది. నిన్నొక్క రోజే ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసిందట. ఆ తర్వాత స్థానంలో జైలర్ రూ.42 కోట్లు, ఓ మైగాడ్ రూ.20 కోట్లు కలెక్ట్ చేశాయట. వీటితో పాటుగా భోళా శంకర్, రాణీకి ప్రేమ్ కహాని, ఓపెన్ హైమర్, బార్బీ, మిషన్ ఇంపాజిబుల్-7, మెగ్ ఇలా అన్ని సినిమాలు కలుపుకొన్ని ఇండిపెండెన్స్ డేకు దాదాపు రూ.140 కోట్లు కలెక్షన్‌లు వచ్చాయట. ఇది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఓ అరుదైన రికార్డు.
ఓ వైపు తమిళంతో పాటు తెలుగులోనూ జైలర్ ఊచకోత కొనసాగిస్తుంది. కర్ణాటకలో మంగళవారం తెల్లవారుఝామున ఆరు గంటల షోలు వేస్తున్నా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. అక్కడే అలా ఉంటే ఇక తమిళనాడు గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. తెలుగులో ఇప్పటికే భోళా శంకర్ థియేటర్లు జైలర్‌కు ఇచ్చేశారని ఓపెన్‌గా వినిపిస్తున్న టాక్. పైగా బుక్ మై షోలోనూ థియేటర్‌ల కౌంట్ స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ఓ మై గాడ్-2, గదర్-2 సినిమాలు సైతం హైదరాబాద్ వంటి పలు పెద్ద నగరాల్లో భీభత్సమైన కలెక్షన్‌లు కొల్లగొడుతున్నాయి.
ముఖ్యంగా రెండు దశాబ్దాల క్రితం నాటి గదర్ సినిమాను సీక్వెల్ చేస్తే.. జనాలు ఎగబడి మరీ థియేటర్‌లకు వెళ్తున్నారు. ఎప్పుడో సోలో మార్కెట్‌ను కోల్పోయిన సన్నీ డియోల్.. ఏకంగా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్‌లు కొల్లగొట్టి జెండా పాతేశాడు. దీని దెబ్బకు సూపర్ టాక్ తెచ్చుకున్న ఓ మై గాడ్-2 కలెక్షన్‌లు కౌంట్ తగ్గిపోయింది. చాలా కాలం తర్వాత మాస్ సినిమా వచ్చిందంటూ గదర్-2 సినిమాకు ట్రాక్టర్‌లలో థియేటర్‌లకు వెళ్తున్న దృశ్యాలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.