భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. క్రికెట్ లో సెంచరీలు చేస్తూ ఎందరో అభిమానులను పోగెసుకున్నాడు.. అయితే ఈ మధ్య కాలంలో జట్టులోకి కొత్త ఆటగాళ్ళు రావడంతో కోహ్లీ ఎక్కువ మ్యాచ్ లు ఆడలేక పోయారు.. అయినప్పటికీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి అత్యధికంగా సంపాదించిన మొదటి భారతీయుడు కోహ్లీ నిలిచాడు. ఒక నివేదిక ప్రకారం, 2023లో ఇన్‌స్టాగ్రామ్‌లో చెల్లించిన ప్రతి పోస్ట్‌కు కోహ్లీ రూ.11 కోట్లకు పైగా వసూలు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి… ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ అగ్రస్థానంలో ఉన్నారు..
పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసినందుకు రూ. 26.75 కోట్లు వసూలు చేసినట్లు హాప్పర్ హెచ్‌క్యూ నివేదించింది. లియోనెల్ మెస్సీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. అతను ఒక్కో పోస్ట్‌కు 21.49 కోట్లు తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, క్రీడాకారుల జాబితాలో టాప్ 20లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు విరాట్ కోహ్లీ.. కోహ్లీ ఒక్క పోస్టుకు రూ.11 కోట్లకు పైగా డబ్బులను వసూల్ చేస్తున్నాడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీని అనుసరించే వారి సంఖ్య 256 మిలియన్లుగా ఉంది..
ఇదిలా ఉండగా..ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లోబల్ సూపర్‌స్టార్ల ఆదాయాలు సంవత్సరాలుగా ఎలా పెరిగాయో చూసి హాపర్ హెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు మైక్ బండర్ ఆశ్చర్యపోయాడు. ఆటలోని సూపర్‌స్టార్ల ప్రభావం మైదానం వెలుపల కూడా ఎలా పెరుగుతుందో కూడా అతను హైలైట్ చేశాడు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా సూపర్ స్టార్‌ల సంపాదన పెరుగుతుండడం నాకు ఇప్పటికీ షాకింగ్‌గా ఉంది. అయితే, నిలకడగా అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తున్నారని అతను అంటున్నాడు.. ఆ లిస్ట్ లోకి విరాట్ కోహ్లీతో పాటు, ఈ జాబితాలో 29వ స్థానంలో ఉన్న భారతదేశానికి చెందిన బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో ఒకదాని ద్వారా 2023లో రూ.4.40 కోట్లు సంపాదించింది… ఇలా చాలా మంది డబ్బులను సంపాదిస్తున్నారు..