భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగోసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించి క్రీడాభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. శనివారం (ఆగస్టు 12) చెన్నై వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా 4-3తో మలేషియాపై విజయం సాధించింది. తద్వారా నాలుగోసారి ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇంతకుముందు 2018లో టీమిండియా ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో భారత్ స్టార్‌గా నిలిచిన ఆకాశ్‌దీప్ సింగ్ చివరి గోల్ చేసి టీమిండియాను.విజేతగా నిలిపాడు. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు మొత్తం టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌లు గెలిచింది. ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా అయింది.
ఇక ఈ మ్యాచ్‌కు ముందు భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో 4 – 0 తేడాతో దాయాదిని కూడా చిత్తుగా ఓడించింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన మనోళ్లు.. చివరి వరకు దూసుకెళ్లారు. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ (15వ, 23వ) కొట్టగా.. మరో ప్లేయర్ జుగ్‌రాజ్ సింగ్ (36వ), ఆకాశ్‌దీప్ సింగ్ (55వ) చెరో గోల్‌ను సాధించారు. అయితే మూడు గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. ఇక ఆకాశ్‌దీప్ ఫీల్డ్ గోల్ సాధించాడు.