ఆసియా కప్(ASIA CUP) సూపర్-4(SUPER 4) మ్యాచు(MATCH)లో పాకిస్తాన్(PAKISTAN)పై భారత్(INDIA) ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిని 228 పరుగుల(228 RUNS) తేడాతో ఇండియా చిత్తు చేసింది. భారత్ తొలుత 356/2 స్కోర్(SCORE) చేయగా, పాకిస్తాన్ 32 ఓవర్లలో 128 పరుగులకు(128 RUNS) 8 వికెట్లు(8 WICKETS) కోల్పోయింది. గాయం కారణంగా నసీమ్ హరీస్ రౌఫ్ బ్యాటింగుకు రాకపోవడంతో భారత్ విజయం ఖరారైంది. కుల్దీప్ యాదవ్(KULDEEP YADAV) 5, బుమ్రా(BHUMRA), హార్ధిక్(HARDHIK), శార్థూల్(SHARDUL) తలా వికెట్ తీశారు. అయితే.. విరాట్ కోహ్లీ(VIRAT KOHLI), కేఎల్ రాహుల్(KL RAHUL) సెంచరీలతో రెచ్చిపోగా… కెప్టెన్ రోహిత్ శర్మ(CAPTAIN ROHITH SHARMA), శుభ్‌మన్ గిల్(SUBHAMAN GILL) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన పాక్ జట్టు ఆరంభం బాగోలేదు. ఐదో ఓవర్లో 17 పరుగుల స్కోరు వద్ద ఇమామ్ ఉల్ హక్ రూపంలో జట్టుకు తొలి దెబ్బ తగిలింది. దీంతో తొలి 10 ఓవర్లలో పాక్ జట్టు 1 వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. 11వ ఓవర్‌లో, హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టుకు అతిపెద్ద దెబ్బను అందించాడు. అతని అద్భుతమైన ఇన్‌స్వింగ్ బాల్‌లో వారి కెప్టెన్ బాబర్ అజామ్‌ను బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ 24 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫకార్ జమాన్ (27), ఆఘా సల్మాన్ (23) ఫర్వాలేదనిపించగా మిగిలిన వారు విఫలం కావడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా, బుమ్రా, పాండ్య, శార్దూల్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.