చైనా(CHINA)లో జరుగుతున్న19వ ఆసియా క్రీడల్లో(ASIAN GAMES 2023)భారత మహిళల క్రికెట్ జట్టు(INDIANS WOMEN CRICKET TEAM) చరిత్ర సృష్టించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగి పసిడి పతకాన్ని(GOLD MEDAL) ముద్దాడింది. దాంతో, పురుషుల జట్టు కూడా అదే తీరుగా ఆడి మరో స్వర్ణం భారత్ ఖాతాలో వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే.. ఈ పోటీల్లో ప్రధాన జట్టు కాకుండా రుతురాజ్ గైక్వాడ్(RUTURAJ GAIKWAD) సారథ్యంలో యువకులతో కూడిన టీమిండియా(TEAM INDIA) బరిలోకి దిగనుంది.
తెలంగాణ(TELANGANA) కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ(TILAK VARMA)కు ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కాకముందే మహిళల క్రికెట్ నిర్వహించారు. కానీ, ఆసియా క్రీడల చివరి రోజు పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్(CRICKET GOLD MEDAL MATCH) జరగనుంది. రోహిత్ శర్మ(ROHITH SHARMA) సారథ్యంలోని ప్రధాన జట్టు ఆస్ట్రేలియా(AUSTRALIA)తో మూడు వన్డే సిరీస్ ఆడుతోంది. అనంతరం అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) మొదలవ్వనుంది. 2 ఏండ్ల తర్వాత స్వదేశంలో జరుగనున్నఈ మెగా టోర్నీలో టీమ్‌ఇండియా ట్రోఫీపై కన్నేసింది. అందుకని సెలెక్టర్లు యువకులతో కూడిన జట్టును ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేశారు.
మహిళల విభాగంలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా మయన్మార్‌తో మ్యాచ్ రద్దు అయినప్పటికీ మెరుగైన ర్యాంకింగ్స్ కారణంగా స్మృతి మంధాన సేన సెమీ ఫైనల్‌కు చేరింది. ఇక సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించిన టీమ్‌ఇండియా ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది.
శ్రీలంకతో సోమవారం జరిగిన జరిగిన టైటిల్ పోరులో హర్మన్‌ప్రీత్ బృందం 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్మృతి మంధన (46), జెమీమా రోడ్రిగ్స్ మాత్రమే (42) రాణించారు. అనంతరం లంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులకే పరిమితమైంది.