Friday, December 20, 2024
Home స్పోర్ట్స్ IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఎంత మంది చూశారో తెలిస్తే షాక్!

IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఎంత మంది చూశారో తెలిస్తే షాక్!

by స్వేచ్ఛ
0 comment 72 views
IND vs PAK

ఇండియా, పాకిస్థాన్(India- Pakistan) మధ్య మ్యాచ్‌ అంటే క్రికెట్‌ లవర్స్‌(Cricket lovers) కు పండగే. ఈ మ్యాచ్ అంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఏ పనిలో ఉన్నా.. ఎక్కడున్నా సరే టీవీలకు అతుక్కుపోవాల్సిందే. అయితే ఒకప్పుడు దాయాదుల పోరు అంటే అందరు ఒకదగ్గర గూమికూడి మ్యాచ్ చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. ట్రెండ్ మారింది. టీవీలతో అవసరం లేకుండా.. డైరెక్ట్ గా మొబైల్ లోనే చూసేయొచ్చు. జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Jio, Disney Plus Hot Star)వంటి ఆప్ ల ద్వారా ఫోన్లలోనే ఎక్కువగా చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే తాజాగా నిన్న జరిగిన భారత్- పాక్(India- Pakistan) మ్యాచ్ లో.. 228 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది ఇండియా. ఈ చారిత్రాత్మకమైన మ్యాచ్‌ను టీవీల్లో కంటే.. ప్రత్యక్షంగా వీక్షించిన వారు రికార్డు స్థాయిలో ఉన్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 2.8 కోట్ల మంది చూశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించలేదు. వాస్తవానికి.. ఆసియా కప్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వద్ద ఉండగా.. అభిమానులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.

ఈ రికార్డుపై బీసీసీఐ సెక్రటరీ జై షా ‘X’ వేదికగా స్పందించారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 2.8 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారని ఆయన ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా.. జై షా తన ట్వీట్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను ప్రస్తావించారు. ఇంతకుముందు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీక్షించిన రికార్డు ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ పేరిట ఉంది. ఎందుకంటే.. ప్రపంచ కప్ 2019 చివరి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. అందుకే 2.52 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు. కానీ ఇప్పుడు ఆ రికార్డును భారత్-పాక్ మ్యాచ్ అధిగమించింది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News