చిరకాల ప్రత్యర్థులు భారత్(India) -పాకిస్థాన్(Pakistan) జట్ల మధ్య ఆసియా కప్(Asia Cup2023) పోరుకు శ్రీలంక(Srilanka)లోని పల్లెకెలె వేదికైంది. దాయాది జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం పోరులో తలపడనున్నారు. ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ టాస్ నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్.. పది ఓవర్లలోపే మూడు కీలక వికెట్లు పారేసుకుంది.
వర్షం వల్ల రెండోసారి మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ స్కోరు 11.2 ఓవర్లలో 3 వికెట్లకు 51 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (6 బ్యాటింగ్), ఇషాన్ కిషన్ (2 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2 వికెట్లు తీయగా, హరీస్ రవూఫ్ 1 వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ(Weather Department) ముందే హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభమయ్యే (3 గంటలకు) సమయానికి వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇదివరకే తెలిపింది. నేడు ఉదయం నుంచి అక్కడక్కడా చినుకులు కురుస్తున్నా భారీ వర్షం అయితే పడలేదు. టాస్ వేసే సమయంలో కూడా వాతావరణం బాగానే ఉంది. కానీ మ్యాచ్ ఆరంభమై నాలుగు ఓవర్లు పడ్డాయో లేదో వరుణుడు ఏదో ఎత్తిపోయినట్టు లంకలో వాలిపోయాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు.
కొద్దిసేపు కురిసిన వర్షం ప్రస్తుతానికి తగ్గింది. అయితే పిచ్ మీద కవర్లు ఇంకా తొలగించలేదు. నేటి సాయంత్రం వరకూ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయని హెచ్చరికలున్న నేపథ్యంలో వరుణుడు ఈ మ్యాచ్‌ను సజావుగా సాగనిస్తాడా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్(World Number one) ర్యాంకు టీమ్‌గా ఉన్న పాకిస్తాన్.. నాలుగేండ్ల తర్వాత భారత్‌తో వన్డే ఆడుతున్నది. చివరిసారిగా ఈ రెండు జట్లూ 2019 వన్డే వరల్డ్ కప్ (భారత్‌దే విజయం) లో తలపడ్డాయి. వన్డేలలో పాకిస్తాన్ చివరిసారి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిచింది. ఆసియా కప్‌లో కూడా వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై పాక్ గెలిచి తొమ్మిదేండ్లు దాటింది. ఆసియా కప్ (వన్డేలు) లో భారత్.. పాకిస్తాన్‌పై చివరిసారి 2014లో గెలిచింది. 2018లో ఇరు జట్లూ రెండు సార్లూ తలపడగా రెండింటిలోనూ భారత్‌నే విజయం వరించింది.
ఇరు జట్లూ వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా ఆసియా కప్‌కు బరిలోకి దిగుతున్న విషయం విదితమే. భారత బ్యాటింగ్ వర్సెస్ పాకిస్తాన్ బౌలింగ్‌గా నేటి మ్యాచ్ జరుగనుంది. బలాబలాపరంగా చూస్తే ఇరు జట్లలోనూ సమర్థవంతమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూసే కోట్లాది అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పొందాలని చూస్తుండగా వరుణుడు శాంతించాలని అభిమానులు కోరుకుంటున్నారు.