ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం(Great win for India) సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో టీమ్ఇండియా(Team India) నెగ్గింది. 28.2 ఓవర్లలో ఆసీస్‌ను 217 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (53 పరుగులు), చివర్లో సీన్ అబాట్ (54) రాణించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు.. ప్రసిద్ధ్ కృష్ణ 2 , షమీ ఒక వికెట్ పడగొట్టారు. ఇక సెంచరీతో అదరగొట్టిన టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది’ మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకుంది.
400 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన ఆసీస్‌కు.. భారత పేసర్ ప్రసిద్ధ్(Prasiddh) ఆరంభంలోనే షాకిచ్చాడు. అతడు ఓపెనర్ మ్యాథ్యూ షాట్ (9), స్టీవ్ స్మిత్ (0)ను పెవిలియన్ చేర్చాడు. తర్వాత మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆట కొద్దిసేపు నిలిచిపోయింది. ఇక మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి ఆసీస్ టార్గెట్‌ను 317 పరుగులుగా నిర్దేశించారు. వర్షం తగ్గిన తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో ఆసీస్ టపాటపా వికెట్లు పారేసుకుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లలో ఓపెనర్ వార్నర్.. చివర్లో అబాట్ మెరుపులు మెరిపించినా అవి ఓటమి అంతరాయాన్ని తగ్గించగలిగాయి.