తిరుపతి(TIRUPATHI)లో 20 కోట్ల రూపాయల(20 CRORE RUPEES) వ్యయంతో ఆధునీకరించిన వినాయక సాగర్(VINAYAKA SAGAR)ను టీటీడీ ఛైర్మన్(TTD CHAIRMAN), తిరుపతి ఎమ్మెల్యే(TIRUPATHI MLA) భూమన కరుణాకర రెడ్డి(BHUMANA KARUNAKAR REDDY) ప్రారంభించారు. స్థానికుల కోరిక మేరకు వినాయక సాగర్ మధ్యలో వినాయక స్వామి(GANESH IDOL) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఒకప్పుడు లింగాలమ్మ చెరువు పేరుతో ఈ ప్రాంతం రైతుల పాలిట కల్ప తరువుగా ఉండేదని.. సరైన కాలువలు లేకపోవడం వల్ల డ్రైనేజీ(DRAINAGE) చెరువుగా మారిపోయిందన్నారు. ప్రస్తుతం లింగాలమ్మ చెరువును ఆధునీకరించడంతో పాటు వినాయక సాగర్ అని పేరు పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చెరువు తిరుపతికే ఓ మణిహారంగా నిలిచిందని, ఓ ఆభరణంగా మారిందన్నారు.
వినాయక చవితి(GANESH CHAVATHI FESTIVAL) ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నామని భూమన వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాలకు నగర పాలక సంస్థ కార్యాలయమే ప్రధాన వేదికగా నిలబోతోందన్నారు. ఇతర ప్రాంతాల వారెవరైనా తిరుపతి వైపు చూసే విధంగా అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే వినాయక సాగర్ ప్రాంతంలో రెండు మూడు వేల మంది వాకర్స్ వాకింగ్ కోసం వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. శ్రీ కృష్ణజన్మాష్టమి(SRI KRISHNASTAMI) పర్వదినాన ఇంత మంచి ప్రాజెక్టును ప్రారంభించుకోవడం శుభకరంగానూ భావిస్తున్నామన్నారు.