భారతదేశం చాలా గొప్ప మరియు విభిన్నమైన వృక్షజాలం మరియు జంతుజాలం కలిగి ఉంది మరియు జీవ వైవిధ్యం పరంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటి. ఎప్పుడూ వన్య ప్రాణులకు సంబంధించిన వింతవింత వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్‌లతో పంచుకునే ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్.. తాజాగా ఓ ఉడుత ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. అయితే అది సాధారణ ఉడుత కాదు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుతల జాతిగా గుర్తింపు పొందిన జాతికి చెందిన ఉడుత. నలుపు రంగులో ఉండే ఈ ఉడుత జాతిని మన దేశంలోనే గుర్తించారు. పశ్చిమబెంగాల్‌లోని బుక్సా టైగర్ రిజర్వ్‌లో తీసిన ఈ ఉడుత ఫొటోను ప్రవీణ్ కాస్వాన్ తాజాగా ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ ఉడుత జాతిని భారతదేశంలోనే గుర్తించారని ఆయన పేర్కొన్నారు. మీరు దీన్ని గుర్తుపట్టగలరా..? అన్ని ప్రశ్నించారు. ఆ పక్కనే బుక్సా ప్రాంతం పేరు ప్రస్తావించారు. ఈ ఉడుత ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫొటోపై నెటిజన్‌ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. కొన్నేళ్ల క్రితం నేను పర్యటనలో ఇలాంటివి చూసే అవకాశం తనకు లభించిందని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని షేర్ చేయగా… నేను కూడా 10-15 సంవత్సరాల క్రితం ముంబైలోని వెర్సోవా అంధేరి వెస్ట్‌లో ఇలాంటిదాన్నే చూశాను అని మరో నెటిజన్ తెలిపారు. ఇది , , మరియు కొంకణ్‌లోని పశ్చిమ కనుమల ప్రాంతానికి ప్రత్యేకమైనదని కొందరు.. ఇంతటి భారీ ఉడుతను ఒడిశాలో చూశాను అని మరొకరు వ్యాఖ్యానించారు. వీటికి టేకు చెట్లపై దూకడం అంటే ఇష్టమని..ఇది మలబార్ జెయింట్ స్క్విరెల్ అని నెటిజన్లు కామెంట్స్ చేశారు.