చాలా మంది పైనాపిల్ మార్కెట్లో కనిపించినా.. కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. దాన్ని కోయడం కాస్త కష్టమని.. దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎవరైనా ముక్కలు కోసి ఇస్తే మాత్రం ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. పుల్ల పుల్లగా.. తియ్యతియ్యగా ఉండే.. పైనాపిల్ టేస్ట్ కాస్త గమ్మత్తుగానే ఉంటుంది. దీని జ్యూస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. పైనాపిల్‌తో స్మూతీలు, ఫ్రూట్‌సలాడ్‌లా చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. పైనాపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, మాంగనీస్, కెరోటిన్, విటమిన్ సీ, ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ తరచుగా తింటే.. ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో.. తెలుసుకోవాలంటే స్టోరీ చదివేయండి.
పైనాపిల్‌లో బ్రొమెలనిన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లో జిగురులా ద్రవాన్ని కరిగేలా చేస్తుంది. . కణజాలంలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్), నొప్పి తగ్గటానికీ తోడ్పడుతుంది. దీంతో దగ్గు తగ్గుతుంది. ఆస్థమా, ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలు తగ్గుముఖం పట్టటానికీ సహాయపడుతుంది. ఇందులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణం కూడా ఆస్తమాను అదుపు చేయడానికి తోడ్పడుతుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువెక్కువ తినకుండానూ చూస్తుంది. పైనాపిల్‌తో కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలూ దూరమవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది.
పైనాపిల్‌లోని ‘బ్రొమిలైన్’ అనే ఎంజైమ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. అందుకే ఏవైనా గాయాలైనప్పుడు పైనాపిల్ తింటే.. నొప్పి, వాపు, ఇన్‌ఫ్లమేషన్ వెంటనే తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే.. రోజుకు అవసరమైన విటమిన్ సీ లభిస్తుంది. విటమిన్ సీ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కణజాలం వృద్ధి చెందటానికి, కణాల మరమ్మతులోనూ విటమిన్ సి సహాయపడుతుంది.