చాలా మంది అద్దం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అసలు అద్దం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పగిలిన అద్దంలో ఎప్పుడూ కూడా ముఖాలు చూసుకోకూడదు. ఇంట్లో పగిలిన అద్దం లేదంటే మరకలు పడి మాసిపోయిన అద్దాన్ని ఉంచకూడదు. అద్దం లక్ష్మీదేవి అని చెబుతూ ఉంటారు. పూర్వం రోజుల్లో ఈ అద్దాలు లేకపోవడంతో వారి ప్రతిబింబాన్ని నదులు నీటి సరస్సులు అప్పుడు ముఖం సరిగ్గా కనిపించక పోయిన అశుభమనుకునేవారు. అద్దాలు వచ్చాకా అవి పగిలితే అశుభం అన్నట్టు మారిందంటారు. అద్దం అమ్మవారి స్వరూపం అని, గడియారం ఈశ్వర స్వరూపం అని విశ్వసిస్తారు. లక్షీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందనే సంకేతం అట. సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్సాంతి ఉండదని చెబుతారు. ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కూడా ఒకే దగ్గర ఉండిపోదంటారు. అద్దం ముక్కలైనట్టే సంపద చెల్లాచెదురు అయిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి..
ఇంటికి ఎదురుగా ఎప్పటికి అద్దాన్ని పెట్టొద్దు.. అనుకూల శక్తులు అలానే వెనక్కి వెళ్ళిపోతాయి.. దైవ స్వరూపంగా భావించడం వల్లే మైల వచ్చినప్పుడు అద్దాన్ని వినియోగించనివ్వరు పెద్దలు. ఇంట్లో అద్దం పగిలిప్పుడు ఆ అరిష్టం పోవాలంటే ముత్తైదువులకు అద్దం దానం చేయాలి.. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలిందంటే మన రూపం ఛిద్రమైనట్టే అంటే మరణించే సమయం ఆసన్నమైందని తెలసుకోవాలంటారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే చెబుతారు..
అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలవారికి ఒక బలమైన నమ్మకం ఉంది. తెలిసినవాళ్లెవరైనా చనిపోతే, వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డ కప్పేస్తారట. చనిపోయి వారి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అప్పుడు ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పేస్తారట. వాస్తవానికి పగిలిన అద్దంలో చూసుకుంటే కళ్లకు మంచిది కాదంటారు.. ఆరోగ్య పరంగా చెబితే అర్థం కాదని ఇలా అరిష్టం అని చెబుతున్నారు.