హైదరాబాద్ అంటేనే విభిన్న మతాలు.. విభిన్న రుచులు. పర్యాటక ప్రదేశాలు, సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలు. లక్షల మంది ప్రజలు ప్రతిరోజు ఉరుకులు పరుగులతో తమ జీవనం గడుపుతునారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగాల్లో అయితే వేలాది ఉద్యోగులు తన జీవనాన్ని గడుపుతారు. వర్క్ స్ట్రెస్ అవుతున్న కారణంగా వీకెండ్ కి ప్లాన్ చేసుకుంటారు. మరికొందరు హైదరాబాల్ లో ఉండే ప్రముఖ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు చూడడానికి వస్తుంటారు. రాష్ట్రాల్లో ఆనందంగా గడిపేందుకు.. సరదాగా తిరిగేందుకు.. పర్యాటక ప్రాంతాలను చూడాలని అనిపిస్తే మొదటి గుర్తుకొచ్చే ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి. తెలంగాణ రాష్ట్రం పర్యాటక ప్రాంతంగా అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ అనగానే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది.. చార్మినార్, గోల్కొంకడ కోట, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, మ్యూజియం.. తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటాయి.
అయితే ఇవే కాకుండా భాగ్యనగరంలో మరికొన్ని పర్యాటక ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. అవి కూడా ప్రతి రోజు భారీ సంఖ్యలో పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ముఖ్యమైన ఐదు ప్రదేశాలు 1. మల్కం చెరువు పార్కు 2. బన్సీలాల్ పేట్ మెట్ల బావి 3. గండిపేట్ పార్క్ 4. దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్, కేబుల్ బ్రిడ్జ్ 5. హుస్సేన్ సాగర్ లో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్.
పశ్చిమ హైదరాబాద్‌కు మల్కం చెరువు కొత్త పర్యాటక కేంద్రంగా మారింది. నగరంలోని రాయదుర్గం సరస్సును గ్రీన్ పార్క్‌తో పునరుద్ధరించారు. దీనికే ‘మల్కం చెరువు పార్క్’ అని నామకరణం చేశారు. దీన్ని రూ.25కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇది సుమారు 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. మల్కం చెరువులో నడక స్థలం, పచ్చని ఉద్యానవనాలు, చిన్న పిల్లలు ఆనందంగా గడిపేందుకు పార్క్ ప్రదేశం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. పార్క్ లోపల ప్రశాంతమైన వాతావరణాన్ని పర్యాటకులకు అందించేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. అదే విధంగా పార్క్ వెలుపల ఉన్న ఫుడ్ స్టాల్స్ కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
ఉస్మాన్ సాగర్‌లోని ఈ ల్యాండ్‌స్కేప్ పార్క్‌ని ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. హెచ్ఎండీఏ సూమారు రూ.30 కోట్లు పైగా నిధులు కేటాయించి.. 18 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేసింది. ఈ పార్క్‌లో ఎకో-పార్క్ పర్యాటకులను మరింతగా ఆకట్టుకుంటుంది. ఇందులో అక్వేరియం, క్యాంపింగ్ టెంట్లు, ఏవియరీ, ఇన్ఫినిటీ పూల్, విలాసవంతమైన చెక్క కాటేజీలు, బటర్‌ఫ్లై పార్క్.. ఇలాంటి ఎన్నో పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్‌లు, రీల్స్ చేసే ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని కచ్చితంగా సందర్శించవచ్చు. దుర్గం చెరువు దగ్గర ఉన్న కేబుల్ వంతెన హైదరాబాదీలను, ఇతర ప్రాంత పర్యాటకులకు ప్రసిద్ధ ప్రాంతంగా మారింది.