దేశంలో బులియన్ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,045గా ఉండగా.. సోమవారం రూ.4 పెరిగి రూ.60,049కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.75,550గా ఉండగా.. సోమవారం నాటికి రూ.85 పెరిగి రూ.75,635కు చేరుకుంది.హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,049గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,635గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది. ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1914.80 డాలర్లుగా ఉండగా.. సోమవారం 1917 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్వెండి ధర 24.21 డాలర్లుగా ఉంది.క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? యూఎస్డీ కాయిన్ మినహా సోమవారం ప్రధాన క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,47,035 వద్ద స్తబ్దుగా ఉంది. ఇథీరియం, టెథర్, బైనాన్స్ కాయిన్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు బిట్‌కాయిన్ రూ.21,47,035, ఇథీరియం రూ.1,36,136, టెథర్ రూ.82.54, బైనాన్స్ కాయిన్ రూ.17,981, యూఎస్డీ కాయిన్ రూ.82.57 గా ఉంది.