హానీ ట్రాప్ ముఠాను బెంగుళూరు పోలీసులు ఛేదించారు. హానీ ట్రాప్ ద్వారా మగవాళ్ళను ఆకట్టుకొని .. వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ రాకెట్‌లో భాగంగా మగవారి శృంగార వీడియోలు తీసి.. నిందితులు బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 50 మంది మగవాళ్ల దగ్గర నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు తేలింది. బెంగళూరులో ఓ మహిళ హనీ ట్రాప్‌లో పురుషులను బంధించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసే దోపిడీ రాకెట్‌ను కర్ణాటక పోలీసులు ఛేదించారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేయగా.. కేసులో కీలక నిందితురాలిగా ఉన్న మహిళ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
హనీ ట్రాప్‌కి పాల్పడిన ప్రధాన నిందితురాలి పేరు నేహా అలియాస్ మేహర్. మరో ముగ్గురుతో కలిసి ఆమె సెక్స్ రాకెట్ నడిపింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ ద్వారా బాధితులను సెక్స్ కోసం తన నివాసానికి ఆహ్వానించేది. మగవాళ్లకు వలవేసి, ఆ తర్వాత శృంగారం కోసం వాళ్లను తన ఇంటికి ఆహ్వానించేది. శృంగారం చేస్తున్న సమయంలో మరో ముగ్గురు నిందితులు వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. మెహర్‌ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇస్లాం మతంలోకి మారాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని బాధితులను వేధించేవారు.
మెహర్ పురుషులతో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నప్పుడు మిగిలిన ముగ్గురు నిందితులు వీడియో తీస్తారు. తరువాత బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఫుటేజీని ఉపయోగిస్తారు. బాధితులను .. వారు మెహర్‌ను వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారాలని లేదా ఆమెకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఈ ముఠా బ్లాక్ మెయిల్ ద్వారా ఇప్పటి వరకు రూ.35 లక్షలకుపైగా వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ ఏడాదిన్నరకు పైగా కొనసాగిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. మెహర్ ఆచూకీ ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. వారి నుంచి ఇప్పటి వరకు రూ.60,000 రికవరీ చేశారు.
ఈ ఉచ్చులో 50 మందికి పైగా పురుషులు బలైపోయారని భావిస్తున్నందున, బాధితులు ఎంత మంది ఉన్నారనేది విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో ఒకరు ముఠాపై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులపై తప్పుడు నిర్బంధం మరియు మోసానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 348 మరియు 420 కింద పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.