చంద్రబాబు(CHANDRABABU)ను అరెస్ట్(ARREST) చేస్తే అయ్యో పాపం అనేవాడే లేడు.. బంద్(BANDH) విఫలం అవ్వడమే దీనికి నిదర్శనం అన్నారు ఏపీ హోంశాఖ మంత్రి(ANDHRA PRADESH HOME MINISTER) తానేటి వనిత(THANETI VANITHA).. విశాఖపట్నం(VISAKHAPATNAM)లో మీడియా(MEDIA)తో మాట్లాడిన ఆమె.. స్కిల్ డెవలప్మెంట్ కేసు(SKILL DEVELOPMENT CASE)లో లోకేష్(LOKESH) ప్రమేయం ఉందన్నారు.. పూర్తి విచారణ తర్వాత బాధ్యులైన అందరినీ ఫిక్స్ చేస్తాం అన్నారు. రాజమండ్రి జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో చంద్రబాబుకు ముప్పు లేదు.. ప్రజలలో సానుభూతి కోసమే టీడీపీ(TDP) ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.. జనసేన(JANASENA), టీడీపీ(TDP) అరాచకాల నుంచి ప్రజలను కాపాడ డానికే రాష్ట్రంలో 144(144 SECTION) అమలు చేశాం అన్నారు. విశాఖలో జరిగిన జాతీయ జైళ్ల శాఖ ఉన్నతాధికారుల సమావేశానికి హాజరైన వనిత.. చంద్రబాబు కంటే ఎక్కువ వయసు ఉన్న చాలా మంది ఇతర రాష్ట్రాలలో ఆర్ధిక నేరాల్లో అరెస్ట్ అయ్యారని గుర్తుచేశారు.. చట్టం ముందు చంద్రబాబు వయసు మినహాయింపు కాదు అదంతా సానుభూతిని పొందే ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.
స్కిల్ కేసులో తీగ లాగాము డొంక కదలడం ఖాయం.. మరో మూడు కేసులు లైన్లో ఉన్నాయి.. ఆధారాలు లభిస్తే ఎవరినీ వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు మంత్రి తానేటి వనిత.. రాజకీయ కక్ష సాధింపుగా టీడీపీ ప్రచారం చేసి సానుభూతి కోసం ప్రయత్నిస్తోందని.. కక్ష కోసమే అయితే ఇంత కాలం ఎందుకు ఎదురు చూస్తాం..? అని ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ లో లోకేష్ ప్రమేయంపై సమాచారం ఉంది.. ఆధారాలు లభిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించే ప్రయత్నం జనసేన, టీడీపీ చేస్తున్నాయని ఆరోపించారు. నంద్యాల నుంచి హెలీకాఫ్టర్ లో తీసుకుని వస్తామంటే చంద్రబాబు నిరాకరించారు, పవన్ కళ్యాణ్ రోడ్డుపై హంగామా చేశారు.. లోకేష్ పోలీసులను ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇవన్నీ సానుభూతిని పొందడం, రెచ్చగొట్టే చర్యలో భాగమే అన్నారు. ఇక, మమతా బెనర్జీ(MAMATA BENARJI)కి ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులపై అవగాహన లేదని భావిస్తున్నాను. తప్పు చేసిన వాళ్ళను ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు తానేటి వనిత.