ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటి లిస్ట్ ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.. వచ్చే నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవుల్లో 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు వంటివి ఉన్నాయి. ఆర్బీఐ ప్రకారం.. అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి బ్యాంకు హాలిడేస్ భిన్నంగా ఉంటాయి. సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, మహారాజా హరిసింగ్ పుట్టిన రోజు తదితరాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఎప్పుడెప్పుడో ఒకసారి తెలుసుకుందాం..
సెప్టెంబర్ 3న -ఆదివారం
సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి
సెప్టెంబర్ 9న – రెండో శనివారం
సెప్టెంబర్ 10న- ఆదివారం
సెప్టెంబర్ 17న- ఆదివారం
సెప్టెంబర్ 18న – వరసిద్ధి వినాయక వ్రతం
సెప్టెంబర్ 19- గణేష్ చతుర్థి
సెప్టెంబర్ 20- గణేష్ చతుర్థి రెండో రోజు
సెప్టెంబర్ 22- శ్రీనారాయణ గురు సమాధి రోజు
సెప్టెంబర్ 23న – మహారాజా హరిసింగ్ పుట్టిన రోజు
సెప్టెంబర్ 24న – ఆదివారం
సెప్టెంబర్ 25న – శ్రీమంత శంకరదేవ జయంతి
సెప్టెంబర్ 27న- మిలాద్-ఎ-షెరీఫ్ (ప్రవక్త మహమ్మద్ పుట్టిన రోజు)
సెప్టెంబర్ 28న – ఈద్-ఎ-మిలాద్/ఈద్-ఎ-మిలాదున్నబి
సెప్టెంబర్ 29న – ఈద్-ఎ-మిలాద్-ఉల్-నబీ తర్వాత ఇంద్రజాత్ర
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.. ఈ బ్యాంకు సెలవులన్ని కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. వివిధ రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలు, పండగలు, ఇతర ప్రోగ్రామ్స్‌ను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. అయితే సాధారణంగా ముఖ్యంగా బ్యాంకు వినియోగదారులు ప్రతి రోజు ఏదో పని నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో ప్రతి నెల ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయన్న విషయం గమనించడం మంచిది.