రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న నాగౌర్ ఒక చారిత్రాత్మక నగరం. ఈ నగరాన్ని నాగ క్షత్రియులు స్థాపించారు. ఇది నాగౌర్ జిల్లాలోని బికానెర్, జోధ్పూర్ మధ్య ఉంది. పురాణాలలో, చరిత్రలో నాగౌర్ చరిత్ర విషయానికి వస్తే, ఈ ప్రదేశం మహా భారత కాలం నాటిదని చెప్పవచ్చు. అహిచ్ఛత్రపుర రాజ్యంలో నాగౌర్ లోని కొన్ని ప్రాంతాలు రాజుల సాన్నిధ్యంలో ఉండేవి. పురాణాల ప్రకారం, అర్జునుడు అహిచ్ఛత్రపుర రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తన గురవైన ద్రోణాచార్యులకి కానుకగా ఇచ్చాడని తెలుస్తుంది. అహిచ్ఛత్రపుర రాజ్యం ప్రస్తుతం నాగౌర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల పరిధిలో ఉంది.
నాగౌర్ నగరంలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ నాగౌర్ కోట. ఇది 2 వ శతాబ్దంలో నిర్మించిన అందమైన ఇసుకతో కట్టిన కోట. ప్రాచీన కాలంలో జరిగిన అనేక యుద్ధాలకు సాక్ష్యమే ఈ కోట. ఎత్తైన గోడలు, భారీ ప్రాంగణ౦గా ప్రసిద్ది చెందిన ఈ కోట రాజస్తాన్ ఉత్తమ చదునైన భూమి ఉన్న కోట. పర్యాటకులు ఈ కోట లోపల అనేక రాజభవనాలు, ఫౌంటెన్ లు, ఆలయాలు, అందమైన తోటలు చూడవచ్చు. నాగవంశీయులు నిర్మించిన ఈ కోటను తరువాత, మొహమ్మద్ బహ్లిం పునర్నిర్మించారు. ఈ కోటకి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి; మొదటి ద్వారాన్ని ఏనుగుల దాడులు, శత్రు దాడుల నుండి రక్షణ కోసం ఇనుము, కలపతో తయారు చేసారు. రెండవ ద్వారం ‘బీచ్ కా పోల్’, చివరి ద్వారం ‘కచేరి పోల్’. ఈ చివరి ద్వారం పురాతన కాలంలో నాగౌర్ న్యాయవ్యవస్థ గా ఉపయోగించబడింది.
ముస్లిం మతానికి పవిత్ర స్థలం దర్గా ముస్లిం మతానికి పవిత్ర స్థలం దర్గా. ఇది అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం. దీంతో పాటు పర్యాటకులను అమితంగా ఆకర్షించే కమ్లా టవర్ . దీని వెనుక ఉన్న జైన గ్లాస్ ఆలయాన్ని చూడవచ్చు. ఇది పూర్తిగా గాజుతో చేసిన ప్రత్యేకమైన నిర్మాణం. లోపలి భాగం గాజుతో అద్భుతంగా ఉంటుంది, ఇది ఆలయం యొక్క మొత్తం అందాన్ని..ఆకర్షణీయతను మరింత పెంచుతుంది. ఈ ఆలయంలో 24 జైన తీర్థంకరుల నిర్మాణం చూడవచ్చు. నాగౌర్ హాది రాణి మహల్, నాగౌర్ లో అందంగా నిర్మించబడ్డ రాజభవనాలలో ఒకటి. ఈ రాజ భవనం యొక్క గోడలు, పై కప్పు అంతా అందమైన చెక్కడాలు, శాశనాల తో అలంకరించబడి ఉంటుంది. పర్యాటకులు రాజ భవనం లోపల సేకరించబడిన అందమైన కూడ్య చిత్రాలను చూడటానికి వస్తుంటారు.
నాగౌర్ జైన గాజు మందిరం, నాగౌర్ నగరంలోని కమ్లా టవర్ వెనుక ఉంది. ఈ ఆలయం దేశంలో ఉన్న అన్ని జైన మందిరాలలో ప్రత్యేకమైనది కారణం ఈ ఆలయం మొత్తం గాజుతో చేయబడింది. పర్యాటకులు ప్రాచీన కళను ప్రతిబింబించే ఆకర్షణీయమైన గాజు పనితనాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ మందిరం లోపలి భాగం తోరణాలతో, అందమైన చలువరాతితో అలంకరించబడి ఉంటుంది. నాగౌర్ నాగౌర్ నగరంలో నే కాక, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా బాగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణ నాగౌర్ కోట. ఈ కోటని ఇసుకతో క్రీ.శ. 2 వ శతాబ్ధంలో నిర్మించారు. ఎత్తైన గోడలు, భారీ ప్రాంగణం కల్‌గిీ ఉన్న ఈ కోటలో భవనాలు, ఫౌంటైన్ లు, తోటలు, అటస్థలాలు ఉన్నాయి. ఈ కోటకి మొత్తం మూడు ప్రధాన ద్వారాలు ఉంటాయి. వీటిని శత్రువుల బారినుండి రక్షించుకొనేందుకు ఇనుము, కలపతో తయారుచేశారు.
దీపక్ మహల్, నాగౌర్ దీపక్ మహల్, నాగౌర్ లోని మరో అందమైన రాజభవనం. ఇక్కడ కూడా రాజభవన గోడలు చిత్రాలు, శాసనాల రూపంలో ప్రత్యేక పూల నమూనాతో అలంకరించబడి ఉంటాయి. రాణి మహల్, నాగౌర్ రాణి మహల్, నాగౌర్ లోని అందమైన రాజభవనాల్లో ఒకటి. ఇక్కడ నాగౌర్ రాజులు, రాణులు నివసించేవారని స్థానికులు చెబుతారు. పర్యాటకులు రాజభవనం లోపల ఈత కొలను ను కూడా చూడవచ్చు. టర్కీన్ దర్గా నాగౌర్ నాగౌర్ నగరంలో ఉన్న టర్కీన్ దర్గా ప్రధాన ధార్మిక కేంద్రం. అజ్మీర్ దర్గా తర్వాత ముస్లిం లు ఎక్కువగా ఈ దర్గాను దర్శించుకుంటారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి ప్రధాన శిష్యులలో ఒకడైన ఖ్వాజా హమిదుద్దిన్ నాగౌరి కి గుర్తుగా టర్కీన్ దర్గా ను నిర్మించారు.సైజి కా టాంకా నాగౌర్ శ్రీ సైజి మహారాజు సాధు సమాధికి పేరుగాంచిన ఈ సైజి కా టాంకా, నాగౌర్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ సాధువు అతని జీవిత౦ మొత్తాన్నీ భగవంతుని ధ్యానంలో గడిపాడని స్థానికుల నమ్మకం. రాజపుత్ర వంశానికి చెందిన ఠాకూర్ వంశీయులు దుష్ట ఆత్మల నుండి నాగౌర్ ను రక్షించడానికి సైజి సాధువుని పిలిపించారు అని స్థానికులు చెబుతారు. సాధువుకు ప్రార్ధన చేసే౦దుకు ఈ ప్రదేశానికి అనేకమంది భక్తులు వస్తారు. ఇతర ఆకర్షణలు అలాగే నాగౌర్ ను సందర్శించే పర్యాటకులు అక్బారీ మహల్, అమర్ సింగ్ రాథోర్, వంశీవాలా ఆలయం, నాథ్ జి కి చాత్రి, బర్లీ సమాధులను కూడా చూడవచ్చు.