రజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు. సినిమాల భారీ విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. అనిరుధ్ రవిచందర్ చేస్తున్న అన్ని సినిమాలో కనీసం ఒక పాట అయినా వైరల్ అవ్వాల్సిందే. ఇక తన రివర్టింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కథనాన్ని ఎలివేట్ చేస్తున్న ఆయన తాజాగా రజనీకాంత్ “జైలర్”తో హిట్ అందుకున్నాడు. సినిమాకి ఇంత హైప్ రావడానికి “కావాలా” పాట కీలకపాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిగా వేరే లెవల్లో ఉందని అంటున్నారు.
చెన్నై బేస్ తో ఉన్నా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఇక ఇప్పుడు ఆయన షారుఖ్ ఖాన్ “జవాన్”తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న “దేవర”కి సంగీతం అందించనున్న అనిరుధ్ తన చేతిలో తగినంత సమయం లేనందున రెండు పెద్ద తెలుగు సినిమాలు ఒప్పుకోలేదని అంటున్నారు. ఇక ఈ యంగ్ కంపోజర్ తన పారితోషికంగా ఒక్కో సినిమాకు 8-10 కోట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆ లెక్కన ఆ విధంగా, అనిరుధ్ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే సంగీత దర్శకుడిగా మారాడని అంటున్నారు.