స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(SKILL DEVELOPMENT SCAM) కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత(TDP CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU).. ప్రస్తుతం రాజమండ్రి జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో రిమాండ్(REMAND)లో ఉన్నారు. అయితే, ఆయను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆయన తరపు న్యాయవాదులు(LAWYERS) తీవ్రంగా శ్రమిస్తున్నారు.. కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.. తాజాగా ఏసీబీ(ACB COURT) కోర్టులో చంద్రబాబు తరపున మరో పిటిషన్ దాఖలైంది.. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించటానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సీఐడీ(CID) కార్యాలయంలో ఉన్న కేసు అన్ని పత్రాలు పరిశీలన కోసం అనుమతి కోరారు.. 207 CRPC కింద పిటిషన్ వేశారు న్యాయవాదులు. దీనిపై వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లోధ్ర(SIDDHARDHA LUDHRA).
అయితే, చంద్రబాబు తరపున వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్న న్యాయవాదులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.. వరుసగా పిటిషన్లు వేస్తూ ఉంటే కోర్టు విధులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు న్యాయమూర్తి.. పిటిషన్ వేరే వేస్తారు, ఆర్డర్స్ ఇచ్చే సమయానికి మరో కొత్త పిటిషన్ వేస్తున్నారని న్యాయమూర్తి మండిపడ్డారు. వేరే కేసులు పెండింగ్ లో ఉంటున్నాయని, కోర్టు ప్రొసీజర్ ఫాలో అవడం లేదని.. కోర్టులో పిటిషన్లు వేయటానికి ఒక ప్రొసీజర్ ఉంటుందన్నారు న్యాయమూర్తి.. పిటిషన్ వేయాలంటే 12 లోపు వేయాలి, నంబర్ అవ్వాలి.. తర్వాత విచారణ ఉంటుందని, అలాకాకుండా నేరుగా పిటిషన్ తీసుకు వచ్చి వాదనలు వినాలని అనటం సరికాదని హితవుపలికారు న్యాయమూర్తి. అయితే, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభ్యంతరాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లోధ్ర.. కొత్త పిటిషన్ మీద వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా.. ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే అన్నారు న్యాయమూర్తి.. అయితే, చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై మరో మారు వాదనలు వినిపించారు సిద్దార్థ లోధ్ర.. వాదనల్లో భాగంగా కొన్ని అంశాలపై క్లారిఫికేషన్ కోరారు న్యాయమూర్తి… ఇక, న్యాయమూర్తి అడిగిన క్లారిఫికేషన్ పై వివరణ ఇచ్చారు సిద్దార్థ లోధ్ర.