థానాయికలు అంటే గ్లామర్ ఆవిష్కరణతో కనువిందు చేయడమే కాదు.. నటిగా ఎలాంటి పాత్రలను అయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని నిరూపించుకుంటున్నారు. తమ అందం, అభినయంతోనే కాకుండా విలనిజంతో కూడా ఆకట్టుకున్నారు. ‘అంత అందంగా హొయలొలికించే హీరోయిన్లలో ఇంత క్రూరత్వం కూడా దాగి ఉందా?’ అనేంతలా కొంతమంది హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ ప్లే చేసి ఔరా అనిపించారు. అలాంటి స్టార్ హీరోయిన్లు ఎవరో? వాళ్ళు విలనిజంతో మెప్పించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
త్రిష – ధర్మయోగి
తమిళ స్టార్ హీరో ధనుష్ డ్యూయల్ రోల్‌లో మెప్పించిన చిత్రం ధర్మయోగి. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటికల్ లీడర్‌గా తనలోని కొత్త నటిని ప్రజెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. గ్లామర్ పాత్రలే కాదు విల్లన్‌గా కూడా ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేసింది.
సమంత
ఏ మాయ చేసావే అంటూ కుర్రకారు మనసు దోచుకుంది సమంత. తన గ్లామర్, నటనతో అదరగొట్టే సమంత.. విక్రమ్ హీరోగా వచ్చిన ‘టెన్’ సినిమాలో విలనిజంతో అలరించింది. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయిన కూడా సమంత నెగటివ్ పాత్రకి మంచి మార్కులే పడ్డాయి.
తమన్నా – మాస్ట్రో
ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితోనూ నటించి గ్లామర్, డ్యాన్స్, యాక్టింగ్‌తో తన మార్కును సెట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా లేడీ విల్లన్‌గా ప్రేక్షకులని మెప్పించింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో సినిమాలో లేడీ విల్లన్‌గా తనలోని మరొక్క యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి మంచి మార్కులు కొట్టేసింది.
రెజీనా – ఎవరు
శివ మనసులో శృతి (ఎస్‌ఎంఎస్) సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చారు రెజీనా కసాండ్రా. తన అందం, నటనతో అభిమానులను సంపాదించుకున్న రెజీనా కసాండ్రా.. నెగెటివ్ క్యారెక్టర్లలోనూ అలరించారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’ సినిమాలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రెజీనా.
మౌనిరాయ్ – బ్రహ్మస్త్రం
మోస్ట్ పాపులర్ హిందీ సీరియల్ నాగినితో ఎంతో పాపులారిటీ సంపాందించుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ మౌనీ రాయ్. తర్వాత పలు చిత్రాల్లో నటించిన మౌనీ రాయ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బ్రహ్మస్త్ర చిత్రంలో క్రూరమైన చీకటి రాణిగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
వరలక్ష్మి శరత్ కుమార్
ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ లేడీ విలన్స్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌ని ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా సినిమాల్లో లేడీ విలన్‌గా మెప్పించింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెనాలి రామకృష్ణ, క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఇక తాజాగా విడుదలైన వీర సింహరెడ్డిలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.