కథానాయకులే కాదు.. ఇప్పుడు కథానాయికలు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. తమ స్టార్ డమ్‌తో సినీ ప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. బాక్స్ ఆఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్‌కి అతీతంగా పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఆ పాత్రను సవాల్‌గా తీసుకొని రిస్కీ ఫైట్స్‌తో ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు. ఇప్పటివరకు గ్లామర్‌ని పక్కన పెట్టి ఇంట్రస్టింగ్ మూవీస్‌తో ప్రేక్షకులని మెప్పించిన కధానాయికలు ఎవరో చూసేయండి..
అనుష్క
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు స్టార్ హీరోల సినిమాల మాదిరిగా కలక్షన్స్ వసూలు చేయగలుగుతాయని నిరూపించిన సినిమా అరుంధతి. అనుష్క డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇది ఒక్కటే కాదు స్వీటీ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు భాగమతి, రుద్రమ దేవి, పంచాక్షరీ, సైజ్ జీరో చిత్రాలు అనుష్క క్రేజ్‌ను అమాంతం పెంచేశాయనే చెప్పాలి.
నయనతార
ఇక ఐదారేళ్లుగా ప్రతి ఏడాదీ నయనతార నటించిన ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అయినా వీక్షకుల ముందుకు వస్తోంది. అనామిక, మాయ, డోర, మయూరి, కర్తవ్యం, O2, అమ్మోరు ఇలా పలు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసి, ప్రేక్షకులను మెప్పించారు నయనతార. స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలు చేస్తూనే.. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీద పూర్తి ఫోకస్ పెట్టింది నయనతార.
సమంత
ఇక యాభై సినిమాలు చేసిన అనుభవం ఉన్న సమంత ఒక్కసారిగా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిందనే అనుకోవాలి. యశోద సినిమాతో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్న సమంత శకుంతలంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. గ్లామర్ పాత్రలతో కుర్రకారు హృదయాలను దోచుకునే సామ్ యాక్షన్ సినిమాల్లోనూ తానేమి తక్కువ కాదని నిరూపించుకుంది. ఇక Uటర్న్, ఓ బేబీ చిత్రాల్లోను తనదైన నటనతో ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
కీర్తి సురేష్
‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయిం, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్‌కి ఓ మంచి చాయిస్ అయ్యారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ఆమె ‘పెంగ్విన్, మిస్ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసారు. ఇక ‘గుడ్‌లక్ సఖి’, చిన్ని వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోలకి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించింది కీర్తి సురేష్.