ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ అప్డేటెడ్ ‘2023 హీరో గ్లామర్’ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ హీరో గ్లామర్ బైక్‌ను డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. అలాగే క్యాండీ బ్లేజింగ్-రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్, స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్లతో రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీవీఎస్ రైడర్ 125, బాజాజ్ పల్సర్ 125, హోండా షైన్ బైక్‌లకు పోటీగా హీరో గ్లామర్ బైక్‌ను తీసుకొచ్చినట్లుగా మార్కెట్ వర్గాల టాక్. ఈ గ్లామర్ టూ-వీలర్లో OBD2, E20 కంప్లైంట్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది 7500 rpm వద్ద 10.68 bhp పవర్, 6000 rpm వద్ద 10.6 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ లీటర్‌కు 63 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌లో హీరో i3S (ఐడెల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) కూడా అమర్చారు. హీరో కంపెనీ ఈ గ్లామర్ బైక్ ప్రారంభ ధరను రూ.82,348 (ఎక్స్-షోరూం ధర)గా నిర్ణయించింది.
హీరో గ్లామర్ టూ-వీలర్లో OBD2, E20 కంప్లైంట్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది 7500 rpm వద్ద 10.68 bhp పవర్, 6000 rpm వద్ద 10.6 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. హీరో గ్లామర్ బైక్ ఒక లీటర్‌కు 63 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. హీరో బైక్‌లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్, రియల్‌టైమ్ మైలేజ్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. హీరో కంపెనీ రైడర్ సీటు ఎత్తును 8 మి.మీ; వెనుక సీటు ఎత్తును 17 మి.మీ మేర తగ్గించింది. అలాగే సీటు పొడవును పెంచడానికి ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఫ్లాటర్ రూపంలోకి మార్చింది. అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో బైక్ తీర్చిదిద్దింది.