భాగ్యనగరంలో నూతనంగా ప్రారంభించిన లులు మాల్(LULU MALL) కారణంగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. మాల్‌ను సందర్శించేందుకు చాలా మంది తరలివస్తున్నారు. మాల్‌కు వెళ్లే వాహనాలతో కూకట్‌పల్లి(KUKATPALLY), బాలానగర్(BALNAGAR), వై జంక్షన్(Y JUNCTION) వీధుల్లో ట్రాఫిక్(TRAFFIC PROBLEMS) ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యను చాలా మంది తమ అనుభవాలను పంచుకోవడానికి ట్విట్టర్(TWITTER)లో పంచుకుంటున్నారు. వారిలో కొందరు కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్లు వెళ్లేందుకు గంటకుపైగా సమయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ, ‘లులు మాల్ ఓపెనింగ్ కారణంగా ఎన్ హెచ్ 65(NH 65) సూపర్ హై ట్రాఫిక్(SUPER HIGH TRAFFIC)ను ఎదుర్కొంటోంది. మెట్రో పిల్లర్ A906(METRO PILLAR A906) నుంచి పిల్లర్ A713 వరకు చాలా ట్రాఫిక్ ఉంటోంది’ అని ఓ నెటిజన్ రాసుకువచ్చాడు. ‘లులు మాల్ కారణంగా గత 2 రోజులుగా కేపీహెచ్‌బీ కాలనీలో భారీ ట్రాఫిక్ ఉంటోంది’ అని మరొకరు తెలిపారు.
లులూ మాల్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ సైతం విపరీతమైన రద్దీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా ఎస్కలేటర్లు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఓ వ్యక్తి తెలిపారు. లులు మాల్‌లో తొక్కిసలాట వంటి దృశ్యాలున్నాయని మరో సోషల్ మీడియా యూజర్ చెు్ుాపు. ఆదివారం మాల్‌ను సందర్శించాలని నిర్ణయించుకున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ, ట్రాఫిక్, పొడవైన క్యూల కారణంగా ఐదు గంటలు వృథా చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని లులు మాల్‌ను తెలంగాణ(TELANAGANA) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(MINISTER KTR), లులూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ(YUSAF ALI ) ఎంఎ సమక్షంలో ఇటీవలే ప్రారంభించారు. ఈ మాల్ లో అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. 75 దేశీయ(NATIONAL), అంతర్జాతీయ(INTERNATIONAL BRANDS) బ్రాండ్‌లను కలిగి ఉన్న స్టోర్‌లతో పాటు, మాల్‌లో 14వందల మంది సీటింగ్ కెపాసిటీతో(SEATING CAPACITY) ఐదు స్క్రీన్‌ల సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ వంటి మరెన్నో సౌకర్యాలు ఈ మాల్ లో ఉన్నాయి. ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ గమ్యస్థానాలలో ఒకటిగా ఈ మాల్ నిలుస్తోంది.