మనోడు దుబాయ్ వెళ్తున్నడంటే పిల్లా, జల్లా, మడుగు, మొసలి కదిలివస్తారు. చదవుకోవడానికి విదేశాలకు వెళ్తున్నాడు అంటే మొత్తం ఫ్యామిలీ అక్కడికి చేరిపోతారు. ఒకటి రెండు కార్లు కాదు మూడు, నాలుగు కార్లు అక్కడి రావడం.. వారు ప్రయాణించే విమానం గాలిలోకి ఎగిరేవరకు అక్కడే ఉండి వచ్చేస్తుంటారు. అమెరికా, దుబాయ్ నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే ముందుగానే అక్కడికి చేరకుని తమవారిని రిసీవ్ చేసుకోవడం.. ఇలా రిసీవ్ చేసుకునేందుకు ఓ బ్యాచ్ అక్కడికి చేరుకోవడం ఇలా నిత్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చేవారితో తెగ సందడిగా ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద మనకు కనిపించే జాతార వాతావరణం. ఎయిర్‌పోర్టుకు వెళ్లిన వారికి అక్కడ జన రద్దీని చూసి.. ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు.. మన తెలుగు వారికి విదేశాల మీద మక్కువ ఎంతుందో తెలుసుకోవాలంటే..
ఇటీవల కాలంలో ఏర్పాటు వద్దకు వెళ్లి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులను చూస్తూ అర్థమవుతుంది. విదేశాల నుంచి విద్యార్థులు రావడం సంబంధించిన సీసన్ కావడంతో వచ్చేవారికి స్వాగతం చెప్పడానికి వెళ్లే వారికి వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున బందువులు ఏర్పాటుకు చేరుకోవడంతో ఎయిర్‌పోర్టు వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ సందడి వాతావరణం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా విదేశాలకు కొత్త అడ్మిషన్ల ద్వారా వెళ్లే విద్యార్థులను వీడ్కోలు పలకడానికి ఒక్కొక్క విద్యార్థికి చాలామంది బంధువులు రావడంతో ఇతర ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లడానికి కొంత ఇబ్బందిగా మారుతున్నట్టు తెలుస్తోంది.
అయితే దీనిపైఎయిర్‌పోర్టు నిర్వాహక సంస్థ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి విద్యార్థికి 50 మంది వరకు గరిష్టంగా వీడ్కోలు పలకడానికి వస్తున్నారని.. ఇది తగ్గించుకుంటే ఎయిర్‌పోర్టు వద్ద వాహనాల రద్దీతో పాటు జనం తాకిడి కూడా తగ్గుతుంది. దీని ద్వారా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగదని ఎయిర్‌పోర్టును నిర్వహించే సంస్థ స్పష్టమైన ప్రకటన చేసింది.
మన తెలుగువారికి విదేశాల మీద మక్కువ ఎక్కువ.. ఇటీవల కాలంలో ఆమోజు మరింత పెరిగింది. విద్యార్థులు అమెరికా వెళ్లి చాలా కాలం తిరిగి రాకపోవడంతో వాళ్ళ బంధువులు స్నేహితులు ఇరుగుపొరుగువారు అందరూ ఏర్పాటుకు వచ్చి మరి వీడ్కోలు చెబుతున్నారు. ఎయిర్‌పోర్టు ప్రకటన ద్వారా ఈ రద్దీ తక్కుతుందని ఆశ వారికి ఉందో లేదో కానీ ఎయిర్ పోర్టు వద్ద మాత్రం జన జాతర కనిపిస్తుంది.