మూడురోజుల(Three Days) నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి(Heavy Rains) అధికారులు స్కూళ్ల(Schools)కు సెలవు ప్రకటించారు. మూడు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున విద్యాసంస్థలకు సెలవులు(Holidays) ప్రకటించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వర్ష(Rains) ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం(Government) ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్(Medchal), రంగారెడ్డి(Rangareddy) జిల్లాల్లో కూడా స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. పిల్లలు వర్షానికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల తరువాత వర్షాలు ఎక్కవ పడితే వాటి పరంగా స్కూళ్లకు సెలవు ప్రకటించాలా? లేదా అనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, బయటకు పంపవద్దని సూచించారు. మంగళవారం(Tuesday) తెల్లవారు జాము నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ఉదయం పాఠశాలలు, కార్యాలయాలకు బయల్దేరిన వారి వాహనాలతో రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మూడురోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరికొద్ది గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తలసాని(Talasani) హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్‌కో ఎండీలతో మాట్లాడారు. రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్(Control Room)ను సంప్రదించాలని సూచించారు. హిమాయత్ సాగర్(Himayath Sagar) గేట్లను ఎత్తివేస్తున్నందున మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం, GHMC హెల్ప్‌లైన్ నంబర్ 040-2111 1111, డయల్ 100, EVDM కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667 ను సంప్రదించాలని సూచించారు.