గతవారం రోజులుగా ముంచెత్తిన వాన మూడు నాలుగు రోజులుగా కాస్త ఉపశమించింది. మళ్ళీ తన ప్రతాపాన్ని చూపేందుకు వరుణులు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు(Rains) దంచికొడుతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా() మారుతుందని అంచనా వేసింది. అయితే, గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. రెండురోజులు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గత 24గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 15 సెంటీమీటర్లు, కన్నెపల్లిలో 12.2, ఆసిఫాబాద్ దహెగాంలో 13.4, పెంచికల్‌పేటలో 11.9 సెంమీమీటర్ల వర్షాపాతం నమోదైంది.