చాలామందికి పొద్దున లేవగానే టీ తాగనిదే రోజు గడవదు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న టీ బ్లూ టీ. అపరాజిత పూలతో ఈ టీని తయారు చేస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ బ్లూ టీని ఒక్కసారి తాగితే మళ్లీ విడిచిపెట్టరట. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి? బ్లూ టీతో కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.
బ్లూ టీనే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ, శంఖు పువ్వు అని కూడా పిలుస్తారు. ఇది నీలం రంగులో ఉంటుంది. బ్లూ బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్‌ను నీటిలో మరిగించి ఈ హెర్బల్ టీని ప్రిపేర్ చేస్తారు. ఇందులోని ఆంథోసైనిన్ సమృద్దిగా ఉండటం వల్ల ఈ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ యాక్సిడెంట్లు బ్లూ టీలో ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ టీని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లూ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంఉటంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ టీ కాకుండా బ్లూ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. అలసట, చికాకుగా ఉన్నప్పుడు ఈ బ్లూ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. బ్లూ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి రోజుకు రెండుసార్లు అయినా హ్యాపీగా ఈ టీని తీసుకోవచ్చు. ఈ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. డిప్రెషన్, యాంక్సైటీగా అనిపించినప్పుడు బ్లూ టీ ఓ కప్పు తాగితే వెంటనే మూడ్ ఛేంజ్ అయ్యి యాక్టివ్ అవుతారట.