మల్బరీ.. వీటిని బొంత పండ్లు అని కూడా పిలుస్తారు. మల్బరీలు చూడటానికి బ్లాక్‌బెర్రీస్ మాదిరిగా కనిపిస్తాయి. ఇవి రుచిలో ద్రాక్షపండులా ఉంటాయి. ఈ పండ్లలో బ్లాక్, రెడ్, వైట్ మల్బరీస్ ఉంటాయి. దీనిలో పోషకాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే.. ఫైటోన్యూట్రియెంట్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, , సోడియం, జింక్ , విటమిన్ సి, ఇ, కె, B1, B2, B3, B6, ఫోలెట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలీఫెనాల్ పిగ్మెంట్ యాంటీఆక్సిడెంట్లు, లిపిడ్లు, ప్రోటీన్, డైటరీ ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మల్బరీలు మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మల్బరీ పండ్లోల జీర్ణక్రియకు మేలు చేసే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఈ ప్రక్రియ మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. మీరు జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే.. ఇవి కచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోండి. మల్బరీలు బరువు తగ్గడానికి సహాయపడతాయని ఓ అధ్యయనం పేర్కొంది. ఇటలీకి చెందిన ఎఫ్. డి రిటిస్ ఇన్‌స్టిట్యూట్ & కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ నిర్వహించిన అధ్యయనంలో.. మల్బరీలను తమ రోజువారీ డైట్ ప్లాన్‌లో 1,300 కేలరీలు తీసుకునే వారు, దాదాపు మూడు నెలల వ్యవధిలో వారి మొత్తం శరీర బరువులో 10% తగ్గించుకుంటారని తెలిపింది. మల్బరీ పండ్లలో క్యాన్సర్ కణాలను నిర్మూలించే.. ఆంథోసైనిన్‌లు ఉంటాయి. వీటిలో రెస్వెరాట్రాల్ కూడా ఉంటాయి. వీటికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
మల్బరీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తనాళాలను విస్తరించి, వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూసుకుంటాయి. తద్వారా హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది. మల్బరీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మల్బరీలు మాక్రోఫేజ్‌లలో ఉండే ఆల్కలాయిడ్‌లను వాటిని సక్రియం చేయడానికి ఉపయోగిస్తాయి, ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తంగా ఉంచుతాయి. మల్బరీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
మల్బరీలో పుష్కలంగా ఉండే.. విటమిన్ కె, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు.. ఎముక కణజాలం, ఎముకలను నిర్మించడానికి తోడ్పడతాయి. ఈ పోషకాలు ఎముక క్షీణత, బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. షుగర్ పేషెంట్స్ వైట్ మల్బరీస్ తింటే.. మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వైట్ మల్బరీలో ఉండే కొన్ని సమ్మేళనాలు.. టైప్-2 డయాబెటిస్‌కు మెడిసిన్‌లా పనిచేస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.