మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అందేలా ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
ఇందుకోసం రకరకాల పోటీలు కలిగిన ఆహారాన్ని, పండ్లను తీసుకోమని వైద్యులు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో విటమిన్ సి కూడా ఒకటి. మనిషి శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయడానికి ఈ రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి విటమిన్ సి అన్నది తప్పనిసరి. అంతేకాకుండా గాయాలు త్వరగా మానడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది.
కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అయితే శరీరంలో విటమిన్ సి తక్కువగా ఉంటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. జలుబును తగ్గించడానికి, జలుబు వేధించే సమయం కాస్త తగ్గించడానికి విటమిన్ సి సప్లిమెంటేషన్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. విటమిన్ సి జలుబు, ఫ్లూ, న్యుమోనియా లక్షణాలు, కాల వ్యవధిని తగ్గించడానికి విటమిన్ సి సహాయపడుతుంది. విటమిన్ సి లోపం ఉన్నవారికి జలుబు, ఫ్లూ, ఇన్‌ఫెక్షన్లు త్వరగా సోకే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి, లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడానికి విటమిన్ సి సహాయపడుతుంది.
విటమిన్ సి అధిక ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. షుగర్ పేషెంట్స్‌కు సాధారణ వ్యక్తుల కంటే 30 శాతం తక్కువ విటమిన్ సి స్థాయిలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి లోపం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ సి సహాయపడుతుంది. హృదయ సంబంధ వ్యాధులు, బీపీ ఉన్న పేషెంట్స్‌లో విటమిన్ సి అవయవ నష్టాన్ని రక్షిస్తాయి. విటమిన్ సి ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి, ఇది రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తాయి. విటమిన్ సి లోపం కారణంగా గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. విటమిన్ సి మన శరీరం ఐరన్‌ను గ్రహించడానికి తోడ్పడుతుంది. విటమిన్ సి లోపం కారణంగా రక్తహీనత ఎదురయ్యే ప్రమాదం ఉంది. విటమిన్ సి లోపం వల్ల దంతాలు, చిగుళ్ళు బలహీనపడతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. గాయాలు మానకుండా ఉంటాయి. దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. దీని లోపం వల్ల రక్తనాళాలు పెళుసుగా అవుతాయి. చిగుళ్లు చిట్లి రక్తస్రావం జరుగుతుంది.