Monday, December 23, 2024
Home తెలంగాణ Govt Orders Upgrading Mini Anganwadis: మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Govt Orders Upgrading Mini Anganwadis: మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by Mahadev
0 comment 58 views
Govt Orders Upgrading Mini Anganwadis

తెలంగాణలోని 3,989 మంది మినీ అంగన్‌వాడీ(Mini Anganwadi)లను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్‌వాడీలు(Main Anganwadi)గా అప్‌గ్రేడ్‌ చేయడానికి సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారని.. ఈ క్రమంలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్‌వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ (BRTU) రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి స్పష్టం చేశారు. ఆమె హైదరాబాద్‌(Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ మినీ అంగన్‌వాడీ టీచర్లు ఎలాంటి సమ్మెలో పాల్గొనడం లేదని తేల్చిచెప్పారు.

ఎవరూ ధర్నాలకు, సమ్మెకు వెళ్లొద్దని ఆమె పిలుపునిచ్చారు. కొన్ని యూనియన్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో అప్‌గ్రేడ్‌ జీవోను విడుదల చేస్తామన్న అధికారుల హామీని తాము పూర్తిగా నమ్ముతామని స్పష్టం చేశారు. ఉత్తర్వులు జారీచేసిన సీఎం కేసీఆర్‌(CM KCR)కు రుణపడి ఉంటామని తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని, సమ్మె అవసరమే లేద ని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్ప ర్స్‌ అసోసియేషన్‌ (TNG) నాయకురాలు భిక్షపమ్మ(Bhikshapamma) తెలిపారు.

తమను పిలిచి అన్నం పెట్టి, పీఆర్సీ ఇచ్చి, ఇబ్బంది లేకుండా చూస్తున్న సీఎం కేసీఆర్‌ను తాము సంపూర్ణంగా నమ్ముతామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని యూనియన్లు ఉనికి కోసం అంగన్‌వాడీలకు మాయమాటలు చెప్తున్నాయని, ఆ నేతలు తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ముందుగా అంగన్‌వాడీలను పర్మినెంట్‌ చేయించాలని హితవు పలికారు. అంగన్‌వాడీలంతా నిజాలను గ్రహించాలని ఆమె కోరారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News