తెలంగాణలో వరుస హత్యలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు హత్య సంచలనంగా మారింది. పాఠశాలకు వెళుతుండగా ఉపాధ్యాయుడి బైక్ ను కారుతో ఢీకొట్టారు దుండగులు. కిందపడిపోయిన టీచర్ ను గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా హతమార్చారు.. ఈ ఘటన తో జిల్లా ఉలిక్కి పడింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమండి మండలం నాయకన్ గూడెంకు చెందిన మారోజు వెంకటాచారిప్రభుత్వ ఉపాధ్యాయుడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఇతడు పిఈటిగా పనిచేస్తున్నాడు.. అయితే ఎప్పటిలాగే స్కూల్ కు బయలు దేరాడు. వెంకటాచారి కోసం నాయకన్ గూడెం శివారులో ముందుగానే దుండగులు కాపుకాసారు. బైక్ పాఠశాలకు బయలుదేరిన అతడు ఊరి బయటకు రాగానే దుండగులు కూడా కారులో రెడీ అయ్యారు.
కారును వెంకటాచారి బైక్ పైకి వేగంగా పోనిచ్చి ఢీకొట్టారు. టీచర్ అలా కింద పడగానే మెడపై గొడ్డలితో నరికాడు.. అతడు అక్కడికక్కడే మృతిచెందగా దుండగులు అక్కడినుండి పరారయ్యారు.. అయితే అతను కింద పడిపోవడం తో అక్కడ చూసిన వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. టీచర్ ను చంపిన దుండుగుల ఎరుపు రంగు కారులో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఆ మార్గంలోని సిసి కెమెరాలను పరిశీలించగా ఓ ఎరుపు కారు, దాని వెనకాలే బైక్ వెళుతుండగా పోలీసులు గమనించారు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.