తెలంగాణలో మోస్ట్ డైనమిక్ లీడర్ అంటే రేవంత్‌రెడ్డినే. బలమైన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా. సీఎం కేసీఆర్‌పై అందరికంటే ఎక్కువగా, బలంగా పోరాడుతున్నది కూడా ఆయనే. పీసీసీ చీఫ్‌గా ప్రజాపోరాటాలు చేస్తున్నారు. ఎంపీగా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇలాంటి రేవంత్‌రెడ్డికి ఎంత పటిష్ట భద్రత కల్పించాలి? కానీ, ప్రభుత్వం ఏం చేస్తోంది? ఉన్న సెక్యూరిటీనే తీసేసింది. రేవంత్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సీఎం కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ భగ్గుమంటోంది.
గత ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డికి సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్లు ఆదేశాలతో కొన్నాళ్లు టైట్ సెక్యూరిటీ ఇచ్చి.. ఆ తర్వాత తీసేశారు. ఎంపీగా గెలిచినా.. 4+4 గన్‌మెన్లను మాత్రమే ఇచ్చారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాకనైనా.. భద్రత పెంచాల్సింది పోయి.. మరింత తగ్గించారు. 4+4 ను 2+2 సెక్యూరిటీకి తగ్గించింది సర్కారు. ఎందుకు తగ్గించారంటే.. పోలీసుల దగ్గర కారణం లేదు.
తనకు అదనపు సెక్యూరిటీ కల్పించాలంటూ రేవంత్‌రెడ్డి ఇటీవల కోర్టుకు కూడా వెళ్లారు. అయినా, సెక్యూరిటీ పెంచలేదు. తాజాగా ఉన్న ఇద్దరు గన్‌మెన్లను కూడా తొలగించడం వివాదాస్పదమవుతోంది. దీంతో బుధవారం నుంచి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నారు రేవంత్‌రెడ్డి. అయితే, గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్‌నగర్ పోలీసుల్నీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతా.. 100 రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తాం.. అసలు మిత్తితోని చెల్లిస్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అయితే, ఈ వ్యాఖ్యలకు నిరసనగానే గన్‌మెన్లు రేవంత్ రెడ్డికి కల్పించాల్సిన భద్రతా విధులకు డుమ్మా కొట్టినట్లుగా ముందు సమాచారం అందింది.. కానీ రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో భద్రతను సర్కార్ తొలగించింది. గతంలో 4+4 ఉండే సెక్యూరిటీని తర్వాత 2+2కి కుదించిందని.. ఇప్పుడు పూర్తిగా భద్రతాను తొలగించింది. టీపీసీసీ చీఫ్ పాదయాత్ర చేసిన సమయంలో కూడా తన యాత్రకు పోలీసులు భద్రత కల్పించడం లేదని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓ పార్టీకి చెందిన నాయకుల నుంచి తనకు ముప్పు పొంచి ఉన్నదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి అప్పట్లో ఆదేశించింది.. కానీ తాజాగా ఆయన భద్రతా సిబ్బందిని తొలగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.