దేశంలో పసిడి ధర స్పల్పంగా పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,800 ఉండగా.. శనివారం రూ.170 పెరిగి రూ.60,970కి చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.74,804 ఉండగా.. శనివారం రూ.258 పెరిగి 75,062కు చేరుకుంది. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,970గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ. 75,062గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,970గా ఉంది. కిలో వెండి ధర రూ. 75,062కు చేరుకుంది.విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,970గా ఉంది. కిలో వెండి ధర రూ. 75,062గా ఉంది.ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,970గా ఉంది. కిలో వెండి ధర రూ. 75,062కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. గురువారం 1928 డాలర్లు ఉండగా.. శుక్రవారం 1924 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.51 డాలర్లుగా ఉంది.శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,05,178 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి. బిట్‌కాయిన్ రూ.22,05,178, ఇథీరియం రూ.1,32,256, టెథర్ రూ.83.3, బైనాన్స్ కాయిన్ రూ.17,498, యూఎస్డీ కాయిన్ రూ.83.6 ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దాని విలువ రూ.82.75గా ఉంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.