డిమాండ్ పెరగడం, తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఎంసీఎక్స్‌పై కూడా ఉంది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 270 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని ప్రధాన నగరాల్లో తులం బంగారం రేటు ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,820గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,200లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,670గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం కిలో వెండి ధర రూ.77,100 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజుతో పోల్చితే రూ.200ల మేర పెరిగింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెండి ధర కిలోకు రూ.80,000లుగా ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు డిమాండ్, సరఫరాలపై ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. బంగారం డిమాండ్ పెరగడం అంటే కచ్చితంగా రేటు పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. బంగారం సరఫరా తగ్గితే రేటు కూడా తగ్గుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి గోల్డ్ రేట్లు మారుతుంటాయి. ఉదాహరణకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగోలేకుంటే, పెట్టుబడిదారులు పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తుంటారు. దీంతో గోల్డ్ రేట్ పెరుగుతుంది.