గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం తగ్గడం లేదు. కొత్త పద్ధతుల్లో గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి తరలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చందానగర్ లో భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 100 కిలోల గంజాయిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. కారులో జీడిపప్పు ముసుగులో గంజాయిని కేటుగాళ్లు తరలిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత వారంలో ఒడిశా నుంచి గంజాయి అక్రమంగా దిగు మతి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌ఐ షేక్ ఫకృద్దీన్ వివరించారు. ఒడిశా ప్రాంతం జైపూ ర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 10.3 కిలోల గంజాయిని పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ రూ. 26 వేలు ఉంటుందని తెలిపారు. రైలు ద్వారా ఈ గంజాయిని కలకత్తాలో గల ముర్షిదాబాద్ ప్రాంతానికి తరలించేందుకు అక్రమ రవాణా చేస్తు న్నారని చెప్పారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన షేక్ ముస్తిం, ఇక్బాల్ కబీర్‌లను అరెస్టు చేశామన్నారు. వీరిపై సాలూరు రూరల్ సీఐ ధనుంజయరావు కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం బొబ్బిలి మెజిస్ట్రేట్ వద్దకు తరలించారన్నారు.