హైదరాబాద్(HYDERABAD)లోని ట్యాంక్ బండ్(TANKBUND) పై భాగ్యనగర్ ఉత్సవ సమితి(BHAGYANAGAR USCHAV SAMITHI), వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం(VINAYAKA NIMAJANAM) ఈ ఏడాది హుస్సేన్ సాగర్(HUSSAIN SAGAR)లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు(HIGH COURT) అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం(GOVERNMENT) చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(POP)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వీలు కల్పించాలన్నారు. దీంతో ట్యాంక్ బండ్ లేపాక్షి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి & వీహెచ్ పీ కార్యకర్తలు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని తెలిపారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వీలు లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వం అసమర్ధత అని అన్నారు. ఈ ఏడాది కూడా పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తామని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయాడం చాలా కష్టమని.. గత ఏడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయకుండా ప్రభుత్వం జోక్యం తీసుకోవాలని కోరారు. లేదంటే శాంతి యుతంగా నిర్వహిస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు హైకోర్టు తీర్పుతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. నిమజ్జనం రెండు రోజుల ముందు ఇలాంటి పరిణామాలు మంచిది కాదని చెబుతున్నారు. త్వరగా ప్రభుత్వం జోక్యం చేసుకుని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తామని ట్యాంక్ బండ్ పై మండప నిర్వహకుల ఆందోళన చేపట్టారు. నిమజ్జనం హైకోర్టు ఆర్డర్ కు నిరసనగా ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకులు ఆందోళన నిర్వహించారు. హిందు పండుగల పై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని.. గత సంవత్సరం నుండి ప్రభుత్వం నిమజ్జనం పై ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వాహకులు తెలిపారు.