ఢిల్లీ(DELHI)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20(G20) సమావేశాలు ముగిశాయి. జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ ప్రెసిడెంట్(BRAZIL PRESIDENT) లూలా డిసిల్వాకు అప్పగించారు ప్రధాని మోదీ(NARENDRA MODI). వచ్చే ఏడాది జీ-20 సమావేశాలు బ్రెజిల్‌లో(BRAZIL) జరుగుతాయి. నవంబర్ వరకు జీ-20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్‌లో వర్చువల్‌గా(VIRTUAL) సభ్యదేశాలు మరోసారి సమావేశమవుతామని తెలిపారు ప్రధాని మోదీ. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (సెప్టెంబర్ 10) ‘స్వస్తి అస్తు విశ్వ’ – శాంతి కోసం ప్రార్థనతో జీ-20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు. సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “జీ-20 శిఖరాగ్ర సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు రోడ్‌మ్యాప్ ఆనందంగా ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. 140 కోట్ల భారతీయుల శుభాకాంక్షలతో, “ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ఈ సమ్మిట్ విజయవంతంగా పూర్తవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.
చైనా(CHINA) , రష్యా(RUSSIA) దేశాధ్యక్షులు సమావేశానికి హాజరుకానప్పటికి ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపారు. దురాక్రమణలకు దూరంగా ఉండాలన్న సందేశాన్ని ఈ సమావేశాలు ఇచ్చాయి. జీ-20లో కొత్తగా ఆఫ్రికా యూనియన్‌కు సభ్యత్వం ఇవ్వడంతో కూటమి దేశాల సంఖ్య 21కు చేరుకుంది. ముగింపు రోజు అతిధులు ఢిల్లీలోని మహాత్మాగాంధీ(MAHATHMA GANDHI) సమాధి రాజ్‌ఘాట్(RAJ GHAT)ను సందర్శించారు. గాంధీజీకి దేశాధినేతలు ఘననివాళి అర్పించారు. జీ-20 సమావేశాలు ముగియడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(JOE BIDEN) వియత్నాం(VIETNA) బయలుదేరారు.
జీ-20 సమావేశాల్లో 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. 15 ముసాయిదాలను చర్చించారు. జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్దం(UKRAIEN WAR)పై ఏకాభ్రియాన్ని సాధించారు. నవంబర్‌లో వర్చువల్ సెషన్(VIRTUAL SESSION)ను ప్రతిపాదిస్తూ.. మోదీ మాట్లాడుతూ, “నవంబర్ వరకు భారతదేశానికి G-20 అధ్యక్ష పదవి ఉంది. ఈ రెండు రోజుల్లో, మీరు చాలా విషయాలు, ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. ఏ సలహాలు వచ్చినా స్వీకరించడం.. ఎలా చూడటం మా బాధ్యత. మీరందరూ దీనితో కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను” అని తెలిపారు.
ప్రధాని మోదీ కూడా ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు, ” రాబోయే G20 అధ్యక్ష పదవిని భారతదేశం బ్రెజిల్ కి అప్పగించింది. తన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రెజిల్‌కు సాధ్యమైన అన్ని విషయాల్లో సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. వారు అంకితభావంతో, దృక్పథంతో నాయకత్వం వహిస్తారని, ప్రపంచ ఐక్యతతో పాటు శ్రేయస్సును ముందుకు తీసుకువెళతారని మాకు అచంచలమైన విశ్వాసం ఉందని ట్వీట్ చేసారు.