కెరీర్ పరంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన ఉండదు. కాబట్టి ఏదైనా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే ముందు అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం. అంతేగాక కెరీర్లో త్వరగా స్థిరపడటం కుడి ముఖ్యమే. అలాంటివారి కోసం ఈ కాస్మొటాలజీ.
భారత్‌లో బ్యూటీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. సిటీలతో పాటు పట్టణాల్లోనూ కాస్మోటిక్ క్లినిక్స్ అందుబాటులోకి వచ్చాయి. స్కిన్ అండ్ బ్యూటీ కేర్, మేకప్, హెయిర్ కేర్‌లో నైపుణ్యం ఉన్న వ్యక్తులను కాస్మొటాలజిస్ట్ అంటారు. బ్యూటీ ట్రీట్మెంట్ను అధ్యయనం చేయడాన్ని కాస్మొటాలజీ అంటారు. అనేక పద్ధతుల ద్వారా బ్యూటీ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల దీని పరిధి మరింత పెరిగి శరీరలోని ఇతర భాగాలకు చికిత్స చేయడానికి విస్తరించింది.
కాస్మొటాలజిస్ట్కు ఇవి తప్పనిసరి
ఒక కాస్మొటాలజిస్ట్కు హెయిర్‌స్టైలిస్ట్, బ్యూటీషియన్, స్కిన్-కేర్ స్పెషలిస్ట్, మేక్-ఓవర్ ఆర్టిస్ట్, నెయిల్-ఆర్ట్ స్పెషలిస్ట్, ఐ-బ్రో స్పెషలిస్ట్‌గా సేవలు అందించవచ్చు. కాస్మొటాలజిస్ట్‌గా రాణించాలంటే ముఖ్యంగా ఈ ఫీల్డ్‌పై మక్కువ, కస్టమర్లను హ్యాండిల్ చేసే సామర్థ్యం, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ రంగానికి సంబంధించిన కోర్సులు చేస్తే అవకాశాలను త్వరగా అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు చేస్తూ అప్‌గ్రేడ్ అయ్యే వారికి ఎక్కడైనా అవకాశాలు వస్తాయి. అందుకే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అందించే కోర్సులపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి. అప్రెంటిస్‌గా మంచి పేరున్న క్లినిక్‌లో పనిచేసి ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి కాస్మొటాలజీలో డిప్లొమా చేయవచ్చు.
ఉపాధి అవకాశాలు
ఒక కాస్మొటాలజిస్ట్.. స్కిన్ కేర్ స్పెషలిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, నెయిల్స్ స్పెషలిస్ట్, ఆరోగ్య సంరక్షణ నిపుణుడిగా సిటీలతో పాటు పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అంతేగాక హై-ఎండ్ సెలూన్స్, స్ప్లెండర్ పార్లర్స్, విలాసవంతమైన హోటళ్లు/రిసార్ట్‌లలో పని చేయవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నవారు బ్యూటీ థెరపీ క్లినిక్స్, స్కిన్ క్లినిక్స్, హాస్పిటల్స్ మొదలైన వాటిల్లో పని చేయవచ్చు.