తెలంగాణలోని ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల(Medical College)తో పాటు.. ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్‌కి మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో SNCU వార్డు ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లాను ఇచ్చారు.. ఈరోజు జిల్లాకు మెడికల్ కాలేజీ ని మంజూరు చేసారన్నారు. 1100 మంది దళిత బంధు ఇస్తున్నాం, 3000 మందికి గృహలక్షి పథకంతో పాటు 5000 మందికి ప్రత్యక్ష్యంగా లబ్ది చేకూరుతుందన్నారు.
ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ (Dialysis Center) ఏర్పాటు చేశామని, 7800 కుటుంబాలకి 14000 పట్టాలి ఇచ్చింది బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వమన్నారు.ఈ ప్రాతంలో గిరిజన తండాలకు, గూడాలకు 350 కోట్ల వెచ్చించి కరెంట్ ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని(BRS Govt), దివంగత జడ్పీ చైర్మన్ జగదీష్ కోరిక మేరకు మల్లంపల్లి మండలం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ములుగు జిల్లాలో 100కోట్ల రూపాయలతో గిరిజన తండాలకు,గూడాలకు రోడ్లు నిర్మాణం చేపట్టామని ఆమె అన్నారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) మాట్లాడుతూ.. గిరిజనులకు, గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని ఆయన అన్నారు. మేడారం జాతర ను అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. రెండువేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని, రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. పేదల కోసమే పనిచేసిన ముఖ్య మంత్రులు ఇద్దరే ఇద్దరు.. ఒకటి ఎన్టీఆర్, ఇంకొకరు సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు.