తమ ప్రాణాలు కాపాడుకోవడానికి తీవ్ర అస్వస్తతలో వచ్చిన రోజులకు ఒక్కసారిగా భయం పట్టుకుంది. తెలంగాణలోని నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి(District Central Govt Hospital)లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. మాతాశిశు ఆరోగ్య కేంద్రం(Maternal and Child Health Centre) స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు త్వరత్వరగా వ్యాపించడంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు(Patients) ప్రాణభయంతో బయటకు పరుగు తీశారు. ఈ ఆస్పత్రిలో చిన్నపిల్లలు, బాలింతలు ఉన్నారు.
తల్లులు తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. గదిలో బ్లీచింగ్ పౌడర్ ఉండటంతో పొగలు(Smoke) దట్టంగా అలుముకున్నాయి. పొగ బయటకు పోయేలా ఆస్పత్రి సిబ్బంది కిటికీల అద్దాలు పగులగొట్టారు. వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పారు. మంటలు అదుపులోకి రావడంతో రోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని.. కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగిందని సిబ్బంది తెలిపారు.
‘ఇవాళ ఉదయం మేమంతా మా పనుల్లో ఉన్నాం. పిల్లలు నిద్రపోతున్నారు. మేం అప్పుడే మెలకువ రావడంతో లేచి ఫ్రెషప్ అవుదామనుకుంటున్నాం. ఇంతలోనే వార్డుల్లో అరుపులు వినిపించాయి. మంటలు మంటలు అంటూ అంతా అరవడంతో ఏం జరుగుతుందో కాసేపటి వరకు అర్థం కాలేదు. అగ్ని ప్రమాదం జరిగిందని అర్థమవ్వగానే.. మా పిల్లలను తీసుకుని బయటకు వెళ్లాం. కానీ అప్పటికే వార్డులన్నింటిలో పొగ వ్యాపించింది. ఈ పొగ వల్ల పిల్లలు కాస్త అస్వస్థతకు గురయ్యారు. పొగ గొంతులోకి వెళ్లి మంట పుడుతోంది. సిబ్బంది అప్రమత్తమై కిటికీల అద్దాలు పగులగొట్టడం కాస్త ఉపశమనానిచ్చింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం అదృష్టం.’ – రోగులు