ఊహించని ప్రమాదం వారి జీవితాల్నే అంతమొందించింది. దేవుడిని దర్శించుకొనితమ ఇళ్లకు చేరుకోవాలని తిరుగు ప్రయాణం లో మృత్యు ఒడికి చేరుకున్నారు. తాజాగా, జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) అందరి హృదయాల్ని కలిచివేస్తోంది. తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ భయానక ప్రమాదంలో ఏడుగురు మహిళలు (seven womens)ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపత్తూర్(Thirupattur) జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిందీ ఘటన. తమిళనాడు(Tamilanadu)లోని అంబూర్(Amboor)కు సమీపంలోని ఒనన్గుట్టై గ్రామానికి చెందిన 45 మంది రెండు వ్యాన్లలో ఈనెల 8న కర్ణాటకలోని ధర్మస్థలకు వెళ్లారు. యాత్ర పూర్తి చేసుకుని వారంతా తిరిగి వస్తున్నారు.
సోమవారం వేకువజామున తిరుపత్తూర్ జిల్లా నత్రంపల్లి(Sathrampalli) సమీపంలోని చండియూర్ వద్ద ఓ వ్యాన్ టైర్ పంక్చర్(Vehicle Tyre Puncture) అయింది. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై వాహనాన్ని ఓ పక్కన ఆపి.. డ్రైవర్ టైర్ మార్చుతున్నాడు. ప్రయాణికులు ఆ సమయంలో కిందకు దిగి వ్యాన్ దగ్గరే నిల్చుని ఉన్నారు.అదే రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ లారీ.. ఆగి ఉన్న వ్యాన్ను వెనుక నుంచి ఢీకొట్టింది. రోడ్డుకు అవతలివైపునకు వెళ్లి బోల్తా కొట్టింది. వ్యాన్, మినీ లారీ ఢీకొనడం వల్ల అక్కడే నిల్చున్న వారిలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనను చూసిన ఇతర వాహనదారులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్(Police Station) కి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి పూర్తి సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్, క్లీనర్ సహా 10 మందిని కాపాడి ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు త్వరలో కోలుకుంటారని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.