తెలంగాణలో దారుణం ఘటన జరిగింది. కన్న కూతురును ప్రేమిస్తున్నాడని.. ఓ యువకుడిని అతి కిరాతకంగా వరిపొలంలో ముంచి ఊపిరాడకుండా(Murder) చేసి యువతి కుటుంబ సభ్యులు ప్రాణం తీశారు. మరలా అదే ప్రాంతంలో మృతదేహాన్ని పాతిపెట్టి.. అక్కడ వరినాట్లు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. సినిమా స్టైల్(Cinema Style Murder)లో జరిగిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన దశరథ్ పాశ్వాన్ కుటుంబం, అదే రాష్ట్రానికి చెందిన రంజిత్ పాశ్వాన్ కుటుంబం బతుకుతెరువు కోసం తెలంగాణ వచ్చి దాదాపు 5 ఏళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలోని కోళ్ల ఫారాల్లో పని చేస్తున్నారు. అక్కడ కొన్ని నెలల క్రితం దశరథ్ పాశ్వాన్ కుమారుడు కరణ్ కుమార్ పౌల్ట్రీ ఫాంలో పని చేస్తున్న రంజిత్ పాశ్వాన్ పెద్ద కూతురుతో ప్రేమలో పడ్డాడు.ఇది గమనించిన యువతి తండ్రి.. యువకుడితో తను నీకు కూతురు వరుస అవుతుందని చెప్పాడు. అయినా ఆ విషయం పట్టించుకోకుండా ఆమె వెనుక పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రంజిత్ పాశ్వాన్ అతని సోదరులు కేశంపేట మండలంలోని నిడదవెల్లి గ్రామానికి వలస వెళ్లారు. అక్కడ పని చేసుకుంటున్నారు.
మరోవైపు దశరథ్ పాశ్వాన్ కుటుంబం సిద్దిపేటకు జీవనోపాధి కోసం వెళ్లింది. అయినప్పటికీ కరణ్ కుమార్ తన పద్ధతి మార్చుకోకుండా కొన్ని రోజుల క్రితం నిడదవెల్లికి వచ్చి ఆ యువతిని తీసుకెళతాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఆరా తీస్తే.. కొన్ని రోజుల తర్వాత పట్టుకొని ఇద్దరినీ గ్రామానికి తీసుకువచ్చారు. అప్పుడు కరణ్ కుమార్‌కు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. అయినప్పటికీ యువకుడు తరుచూ అక్కడ వచ్చి ఆమెను కలవడం చేసేవాడు.
ఈ విషయం గ్రహించిన యువతి తండ్రి, బంధువులు ఎలాగైన కరణ్ కుమార్‌ను చంపాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే రంజిత్ సోదరులు పెళ్లి చేస్తామని చెప్పి యువకుడిని నిడదవెల్లి గ్రామానికి రమ్మని చెబుతారు. ఇది నమ్మిన వ్యక్తి గ్రామానికి వస్తే.. గ్రామ శివారులోని దేవాలయం వద్ద కూర్చుకొని మాట్లాడసాగారు. అనంతరం వారందరూ ఒక్కసారిగా కరణ్ కుమార్‌పై దాడి చేసి.. సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి అక్కడ పడేసి గొంతుపై కాళ్లు పెట్టి.. బురదలో తొక్కేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేసి దానిపై వరినాట్లు నాటారు.