Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ Suicide: ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం..

Suicide: ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం..

by స్వేచ్ఛ
0 comment 71 views
family suicide in vizag

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం, గోరపల్లిలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక్కరు చేసిన పనికి ఆ కుటుంబంలోని సభ్యులు అంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటం, పరువు పోతుండటంతో వాటిని భరించలేక తనువు చాలించడానికి నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేయాలని అనుకున్నారు. ముగ్గురు కలిసి విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అంతలోనే వచ్చిన మరో కుటుంబసభ్యుడు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. ఆ ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

గోరపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఆన్ లైన్ గేమ్స్ కు బానిసయ్యాడు. ఆ ఆటలు ఆడుతూ భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. అక్కడా ఇక్కడా అప్పులు చేసి మరీ ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చిల్లి గవ్వా ఆదాయం లేకపోవడంతో.. ఆ అప్పులు తీర్చలేకపోయాడు. అప్పు ఇచ్చిన వారు ఇంటిపైకి వచ్చి గొడవలు చేయడం, పరువు పోతుండటంతో ఆ కుటుంబ సభ్యులు భరించలేకపోయారు. ఎంతకీ సంతోష్ కుమార్ తీరు మారకపోవడంతో.. ఆ కుటుంబ సభ్యులు వారికి ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. సంతోష్ కుమార్ తల్లి, తండ్రి, సోదరి పురుగుల మందు తాగారు. విషం ప్రభావంతో వారు అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన సంతోష్ కుమార్.. కుటుంబ సభ్యులను చూశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురిని కేజీహెచ్ కు తరలించారు. కాగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తండ్రి కల్లూరి సత్యనారాయణ మృతి చెందాడు. భార్య సూర్య కుమారి, కూతురు నీలిమ (21) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News