అనకాపల్లి(ANKAPALLI)లోని పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలోని టీడీపీ నేత(TDP LEADER), మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(BANDARU SATYANARAYANA) ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి(EX MINISTER) బండారు ఇంటి దగ్గర పోలీసు యాక్షన్ మొదలైంది. బండారు ఇంట్లోకి పోలీసులు చొచ్చుకుపోయారు. ఆయనను తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్(AMBULANCE)ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రైవేటు అంబులెన్స్‌కు దారి ఇవ్వమని.. ప్రభుత్వ అంబులెన్స్‌లో ఆయనను తరలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ గో బ్యాక్(POLICE GO BACK) అంటూ మహిళలు నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బండారు సత్యనారాయణ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మంత్రి రోజా(MINISTER ROJA)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండారు సత్యనారాయణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. బండారు సత్యనారాయణ ఆరోగ్యంపై టీడీపీ(TDP) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉదయం నుంచి దీక్షలో ఉండటంతో బీపీ(BP), షుగర్ లెవెల్స్(SUGAR LEVELS) పెరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రయివేట్ అంబులెన్స్(PRIVATE AMBULANCE)లో వైద్యులు వస్తుంటే ప్రభుత్వం అడ్డుకుందని.. ప్రభుత్వ అంబులెన్స్ మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు.
నందమూరి(NANDAMURI), నారా(NARA) కుటుంబాల(FAMILIES)పై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఘాటు విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబంపై భువనేశ్వరి(BHUVANESHWARI), బ్రాహ్మణీ(BRAHAMANI)లపై మాట్లాడే అర్హత నీకు లేదు.. రోజా.. నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చరిత్ర ఎవరికి తెలియదు.. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు అని విమర్శించారు. ఇక, మంత్రి రోజాపై చేసిన బండారు కామెంట్స్(COMMENTS) వైరల్ గా మారడంతో.. మహిళా కమిషన్ స్పందించింది.. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.. 41ఏ కింద నోటీసులు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. దీంతో మాజీ మంత్రి, బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. ఇక, వెన్నెలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
టీటీడీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. మహిళలను కించపర్చడమే మీ సంస్కృతా అని టీడీపీ నేతలనుద్దేశించి ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఏపీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలకు ఆమె కౌంటరిచ్చారు. హిందూ సంప్రదాయాలు ఏం చెబుతున్నాయన్నారు. కానీ టీడీపీ నేతలు మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో సమాజం చూస్తుందని ఆమె చెప్పారు. బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా కూడ ఆయన గెలవలేదంటే ఆయనను ప్రజలు తిరస్కరించారని అర్ధమౌతుందని ఆమె తెలిపారు. ఇలాంటి వ్యక్తులను చట్టం శిక్షిస్తుందని మంత్రి రోజా చెప్పారు.
తెలుగుదేశం(TELUGUDESAM) పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత(MADHAVILATHA) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా గత రాత్రి నుంచి పోలీసులు తమను నిర్బంధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల పాటు తన భర్త బండారు సత్యనారాయణ మూర్తినిఏ విధమైన నోటీసు ఇవ్వకుండా గృహనిర్బంధం చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు బండారు మీద పోలీస్ స్టేషన్లో కానీ, పరవాడ లిమిట్లో గాని, లేకుండా ఎందుకు గృహనిర్బంధం విధించారనే విషయం తనకు తెలపాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది పోలీసులు ఇంటి చుట్టూ భయాందోళన కలిగించారని ఆరోపించారు. భవిష్యత్తులో తన భర్త ప్రాణాలకు సంబంధించి భయాందోళన గురవుతున్నట్టుగా మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలాసేపటి నుంచి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ స్పందించలేదని తెలిపారు. కనీసం ఫిర్యాదు తీసుకున్నదానికి రసీదు కూడా ఇవ్వలేదని, బండారు సత్యనారాయణమూర్తి సతీమణి మాధవిలత ఆవేదన వ్యక్తం చేశారు.