ఏపీలోని వైఎస్సార్ వాహన మిత్ర లబ్దిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. వరుసగా ఐదో ఏడాది..”వైఎస్సార్ వాహన మిత్ర(YSR Vahana Mitra)” నిధులు విడుదల చేశారు. ఈ మేరకు బటన్ నొప్పి సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) విడుదల చేశారు. ఇవాళ విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy)…వరుసగా ఐదో ఏడాది..”వైఎస్సార్ వాహన మిత్ర” నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా ఐదో ఏడాది..”వైఎస్సార్ వాహన మిత్ర(YSR Vahana Mitra)” విడుదల చేసామన్నారు.
2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు సీఎం జగన్. వైఎస్సార్ వాహన మిత్ర’ క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.1,301.89 కోట్లు అని వివరించారు సీఎం జగన్. ఇది మి జగనన్న ప్రభుత్వం కాదు మన అందరి ప్రభుత్వం అని.. దేశంలో ఎక్కడలేని విధంగా జగనన్న సురక్ష పథకం అన్నారు సీఎం జగన్.